/rtv/media/media_files/2025/03/09/C3vnamrWyLoOLDuFtlJt.jpg)
Woman arrested for allegedly sparking massive wildfire in South Carolina
గతవారం అమెరికాలోని నార్త కరోలినా, సౌత్ కరోలినాలో కార్చిచ్చు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఈ కార్చిచ్చు వల్ల ఇప్పటిదాకా 4 వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం కాలిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ మంటలకు సౌత్ కరోలినాలోని మిర్టిల్ బీచ్‌కు చెందిన అలెగ్జాండ్రా బియలౌసౌ (40) అనే మహిళ కారణమని గుర్తించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 15న ఆ మహిళ హోరీ కౌంటి కోర్టులో హాజరుకావాల్సి ఉందని అన్నారు.
Also Read: జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చి.. కుంభమేళాలో జాక్‌పాట్ కొట్టిన రౌడీషీటర్
కోర్టులో ఆమె దోషిగా తేలితే 30 రోజుల జైలుశిక్ష లేదా జరిమానా పడే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే దక్షిణ కరోలినా ఫారెస్ట్రీ కమిషన్ అధికారులు దీని గురించి వివరించారు. '' కోవింగ్టన్ లేక్స్ సబ్ డివిజన్‌లో ఓ చెట్టు వద్ద అలగ్జాండ్రా మంట పెట్టింది. అది పక్కనే ఉన్న ఇతర ప్రదేశాలకు కూడా వ్యాపించింది. మంటలు ఆర్పేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ తగినంత నీళ్లు లేక మంటలు అదుపుకాలేదు. దీంతో చెట్లతో పాటు మిర్టిల్ బీచ్ దగ్గర్లో ఉన్న పలు నివాసాలకు కూడా మంటలు అంటుకున్నాయి.
Also Read: 17 ఏళ్లుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన యూపీ పోలీసులు!
అయితే శనివారం మధ్యాహ్నం నాటికి మంటలు 55 శాతం అదుపులోకి వచ్చినట్లు చెప్పారు. ఇక సౌత్ కరోలినాలో పొడి వాతావరణ పరిస్థితులు ఉండటం వల్ల కార్చిచ్చు మరింత వ్యాపించింది. దీంతో 4 వేల ఎకరాలకు పైగా అటవీ సంపద కాలి బూడిదయిపోయింది. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఖాళీ చెయించి, ఎమర్జెన్సీని ప్రకటించారు. ప్రస్తుతం అత్యవసర వస్తువులు, చెత్తను కాల్చడంపై ఆంక్షలు విధించినట్లు చెప్పారు .
Also Read: న్యూయార్క్ నగరాన్ని కమ్మేస్తున్న కార్చిచ్చు పొగ.. ఆందోళనలో ప్రజలు