Operation Sindoor: పరిస్థితి దారుణంగా ఉంది..ఆపరేషన్ సింధూర్ పై ట్రంప్

భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు. 

New Update
usa

Trump On Operation Sindoor

భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై భారత భద్రతా సలహాదారు అజిత్ ధోవల్...అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు. అలాగే దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు.  ఇరు దేశాలూ ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చెప్పారు. ఆ రెండు దేశాలు దశాబ్దాలుగా గొడవపడుతున్నాయి. ఇది సిగ్గు చేటు విషయమని ట్రంప్ వ్యాఖ్యానించారు. దీనికి ఇరు దేశాలూ వీలైనంత తొందరగా ముగింపు పలకాలని ట్రంప్ సూచించారు. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్డు మీదకు వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరని..ప్రపంచానికి శాంతి కావాలి కానీ యుద్ధాలు కాదని ఆయన అన్నారు. ఎంతో చరిత్ర ఉన్న భారత్, పాక్ లకు ఇది తగదని ట్రంప్ అన్నారు. 

 

 today-latest-news-in-telugu | usa | attacks | america president donald trump 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు