/rtv/media/media_files/2026/01/01/new-year-2026-01-01-11-20-39.jpg)
New Year
న్యూఇయర్ వేడుకలు(New Year 2026) ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున జరిగాయి. డిసెంబర్ 31 రాత్రి నుంచి అందరూ వేడుకల్లో మునిగిపోయారు. కొత్త ఏడాది(Happy New Year 2026)కి స్వాగతం పలికారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కొత్త సంవత్సరం వేళ వింత ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. ఇంతకీ ఆ వింతలు, విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ద్రాక్ష పండ్లు తినడం
స్పెయిన్‌లోని పలు ప్రాంతంలో ప్రజలు న్యూఇయర్‌లోకి వచ్చిన వెంటనే 12 ద్రాక్ష పండ్లు తింటారు. ఒక్కో ద్రాక్షపండుకు ఒక్కో నెలకు ప్రతీకగా అనుకుంటారు. ఒక్కో దాన్ని తింటూ 12 కోరికలు కోరుకుంటారు. మరికొందరు ఒకే కోరికను 12 సార్లు కోరుకుంటారు. ఇలా చేస్తే మనం కోరుకున్నవి జరుగుతాయని, ఏడాదంతా మంచి లైఫ్ ఉంటుందని నమ్ముతారు. ప్రస్తుతం ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. మన ఇండియాలో కూడా చాలామంది ఈ ఆచారాన్ని ట్రై చేశారు.
జపాన్
జపాన్‌లో చూసుకుంటే ఎక్కువగా బౌద్ధ మతాన్ని పాటిస్తారు. అయితే న్యూ ఇయర్(New Year Celebrations 2026) లోకి అడుగుపెట్టిన తర్వాత బౌద్ధ దేవాలయాల్లో 108 సార్లు గంటను మోగిస్తారు. ఈ ఆచారాన్ని జోయానోకానే అని అంటారు. బౌద్ధమతంలో 108 కోరికలు మనిషి దుఃఖానికి కారణమవుతాయని నమ్ముతారు. 108 సార్లు గంట మోగించడంతో ఒక్కో గంట గంట శబ్ధానికి అవన్నీ నశించి ప్రశాంతత ఉంటుందని నమ్ముతారు.
చిలీ
సాధారణంగా న్యూఇయర్ వేళ డిసెంబర్ 31 రాత్రి స్నేహితులు, బంధువులు వేడుకలు జరుపుకుంటారు. కానీ చిలీలో మాత్రం చాలామంది డిసెంబర్ 31 రాత్రి శ్మశానంలో సమయాన్ని గడుపుతారు. చనిపోయిన కుటుంబ సభ్యులు, పూర్వీకులకు తోడుగా ఆ రాత్రి అక్కడ ఉంటారు. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టగానే తమ ఇళ్లకు వెళ్లిపోతారు.
Also Read : న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పిన న్యూజిలాండ్
డెన్మార్క్
డెన్మార్క్‌లో ఒక సంవత్సరం అంతా సేకరించిన ప్లేట్లు, ఇతర సామాగ్రిని కొత్త ఏడాదిలో పగలగొడతారు. తమ స్నేహితులు, బంధువుల ఇంటిముందు పగలగొడతారు. అయితే ఏ ఇంటి వద్ద ఎక్కువ పగిలిన ప్లేట్లు, ఇతర సామాగ్రి ఉంటుందో ఆ ఇంటికి ఎక్కువ అదృష్టం ఉంటుందని నమ్ముతారు.
కొలంబియా
న్యూ ఇయర్ రోజుల కొలంబియా ప్రజలు ఎక్కడి వెళ్లినా తమతో పాటు సూట్‌కేసును తీసుకెళ్తారు. ఇలా చేయడం వల్ల కొత్త సంవత్సరంలో విహారయాత్రలు చేసే ఛాన్స్ వస్తుందని నమ్ముతారు.
బ్రెజిల్
బ్రెజిల్‌లో కొత్త ఏడాది సందర్భంగా తెలుగు రంగు దుస్తులు వేసుకుంటారు. ఆ తర్వాత సముద్రం దగ్గరకు వెళ్లి ఏడుసార్లు అలలపై గెంతుతారు. ఇలా చేయడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.
సౌతాఫ్రికా, ఇటలి
ఇటలీ, సౌతాఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో న్యూఇయర్ వేళ ఇంట్లో ఉండే పాత ఫర్నిచర్‌ను కిటికిలో నుంచి బయటకు పారేస్తారు. ఇంట్లో ఏదైన కీడు ఉంటే ఆ వస్తువులతో పాటు అది బయటకు వెళ్తుందని నమ్ముతారు.
ఫిలిప్పీన్స్
ఫిలిప్పీన్స్ ప్రజలు జనవరి 1న వాళ్ల దగ్గర గుండ్రంగా ఉండే నాణెలు, ఇతర వస్తువులను ఉంచుకుంటారు. పొల్కా డాట్ దుస్తులు వేసుకుంటారు.
Also Read : ఎక్కువ జీతం ఉంటే మీ పంట పండినట్టే..హెచ్ 1 బీ, గ్రీన్ కార్డ్ విషయంలో కొత్త నిర్ణయం
Follow Us