H-1B visa: ఎక్కువ జీతం ఉంటే మీ పంట పండినట్టే..హెచ్ 1 బీ, గ్రీన్ కార్డ్ విషయంలో కొత్త నిర్ణయం

అమెరికా హెచ్‌ 1బీ వీసా, గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియలో భారీ మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేతనాల ఆధారంగా లాటరీ ప్రక్రియను నిర్వహించున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు కింది ఆర్టికల్ లో..

New Update
Indian H 1B Holders Stranded After Work Permit Renewal Trip

Indian H 1B Holders Stranded After Work Permit Renewal Trip

అమెరికా ప్రభుత్వం హెచ్ 1 బీ, గ్రీన్ కార్డుల జారీ రూల్స్ ను పూర్తి మార్చేసింది. హెచ్ 1 బీ వీసా ఫీజును లక్షల డాలర్లకు పెంచేసింది. అలాగే లాటరీ పద్దథితిని కూడా ఆపేస్తామని చెప్పింది. దీంతో పాటూ గ్రీన్ కార్డు లాటరీలు కూడా నిలిపేస్తామని తెలిపింది. అయితే ఇప్పుడు ఇందులో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టున్నారు. జీతాల ఆధారంగా హెచ్ 1బీ లాటరీ, గ్రీన్ కార్డ్ ల లాటరీలను నిర్వహించనున్నారు. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వీసా ఎంపిక విధానంలో నైపుణ్యం, వేతనానికి పెద్దపీట వేస్తూ యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్ సరికొత్త నిబంధనలను విడుదల చేసింది. అంటే ఇప్నపటి వరకు ర్యాండమ్ గా హెచ్1బీ వీసాలను లాటరీలో ఎంపిక చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎక్కువ జీతం ఉన్నవారికే ఇవ్వనున్నారు. 

ఎక్కువ జీతం ఉంటే వచ్చేస్తుంది..

కొత్త రూల్ ప్రకారం హెచ్ 1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి నైపుణ్యం, వారికి ఇచ్చే వేతనం ఆధారంగా ప్రాధాన్యతను కల్పించనున్నారు. అమెరికా వేతన వ్యవస్థ విభజన ప్రకారం లెవల్ 4 ఉన్న వారికి లాటరీలో నాలుగు సార్లు ప్రవేశించే అవకాశం లభిస్తుంది. దీనివల్ల వారు వీసా పొందే అవకాశం 61 శాతానికి పెరుగుతుంది.లెవల్-3 వారికి 3 సార్లు.. లెవల్-2 వారికి 2 సార్లు లాటరీలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే కెరీర్ ప్రారంభంలో ఉండే ఎంట్రీ లెవల్ (లెవల్ 1) ఉద్యోగులకు కేవలం ఒకే ఒక అవకాశం లభిస్తుంది. దీనివల్ల వీరు వీసా పొందే ఛాన్స్ గతంతో పోలిస్తే 15 శాతం తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు వల్ల సీనియర్ ప్రోఫెషనల్స్ కు చాలా లాభం చేకూరుతుంది. అయితే ఫ్రెషర్స్ కు మాత్రం ఇది పెద్ద దెబ్బే. అమెరికాలో చదువుకుని ఉద్యోగాల్లో చేరే వారికి ఇకపై టఫ్ కాంపిటీషన్ ఎదురుకానుంది. 

ఇక గ్రీన్ కార్డు లాటరీ ఎంపికలో కూడా ఇదే విధానాన్ని పాటించనుంది అమెరికా గవర్నమెంట్. ఏటా 55 వేల గ్రీన్ కార్డులను మంజూరు చేస్తుంది యూఎస్‌‌సీఐఎస్. ఇప్పుడు ఇందులో కూడా ర్యాండమ్ గా పిక్ చేయడాన్ని ఆపేసి...సేమ్ హెచ్ 1బీ లాటరీలానే ఎక్కువ జీతం ఉన్నవారికే గ్రీన్ కార్డ్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయనున్నారు. 

Advertisment
తాజా కథనాలు