Train Accident: షాకింగ్ వీడియో.. ఘోర రైలు ప్రమాదం - ప్రాణాలు వదిలిన ప్రయాణికులు

జర్మనీలో జూలై 27 సాయంత్రం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దక్షిణ జర్మనీలోని రీడ్లింగెన్ పట్టణం సమీపంలో ఓ ప్రాంతీయ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Germany Passenger train derails

Germany Passenger train derails

జర్మనీలో ఆదివారం (జూలై 27) సాయంత్రం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. దక్షిణ జర్మనీలోని రీడ్లింగెన్ పట్టణం సమీపంలో ఓ ప్రాంతీయ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సిగ్మరింగెన్ నుండి ఉల్మ్ నగరానికి వెళ్తున్న ఈ రైలులో సుమారు 100 మంది ప్రయాణికులు ఉన్నారు. 

ఇది కూడా చూడండి: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!

సహాయక చర్యలు:

ఆదివారం సాయంత్రం 6:10 గంటల ప్రాంతంలో రీడ్లింగెన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. నలుగురు మరణించగా, సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయని.. దీనివల్ల కొండచరియలు విరిగిపడటం లేదా ఇతర వాతావరణ సంబంధిత కారణాలు ప్రమాదానికి దారి తీసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది. 

ఇది కూడా చూడండి: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అగ్నిమాపక దళాలు, రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రైల్వే అధికారులు దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని ప్రకటించారు. ఈ ప్రమాదం జర్మనీలో ఇటీవలి సంవత్సరాల్లో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. 

train-accident | Latest crime news | crime news

Advertisment
తాజా కథనాలు