ప్రస్తుతం ఆఫ్ఘాన్ తాలిబాన్ పరిపాలనలో ఉంది. అప్పటి నుంచి ఎవరితో సంబంధం లేకుండా రూల్స్ పెడుతూ ఒకరకంగా నియంతృత్వ పాలన కొనసాగిస్తోంది. 2021 నుంచి తాలిబాన్లు ఆఫ్ఘాన్‌ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీని తరువాత ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆ దేశనేత భారత విదేశాంగ కార్యదర్శితో సమావేశమయ్యారు. ఈ ఉన్నతస్థాయి భేటీలో పలు అంశాలపై చర్చించారు.
Also Read: చైనాలో మళ్లీ కొత్త వైరస్ కలకలం.. వెలుగు చూసిన కొత్త వేరియంట్
మా నుంచి ఎలాంటి ముప్పూ ఉండదు...
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో సమావేశమైన అనంతరం అఫ్గాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ మీడియాతో మాట్లాడారు. ఇందులో భారత్‌తో తమ రాజకీయ, ఆర్ధిక సంబంధాలు మరింత మెరుగుకావాలని కోరుకుంటున్నామని ముత్తాఖీ చెప్పారు. భారత్ ఇప్పటికే తమకెంతో మానవతా సహాయం చేసింది...దానికి ధన్యవాదాలని అన్నారు. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, ప్రజా సంబంధాలపై తాజా భేటీలో చర్చించామన్న ఆయన.. అఫ్గాన్ నుంచి భారత్‌కు ఎటువంటి ముప్పు ఉండదని హామీ ఇస్తున్నామని ముత్తాఖీ హామీ ఇచ్చారు. మరోవైపు తమ విద్యార్థులకు భారత్ వీసాలను జారీ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: అమెజాన్ కొత్త సేల్.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై ఆఫర్లే ఆఫర్లు!
Also Read: పట్టపగలే యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి పొడిచి! (వీడియో వైరల్)