/rtv/media/media_files/2025/01/18/FBPGCcizS3PipeaILKP6.jpg)
saif ali khan
Kareena Kapoor: నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి బాలీవుడ్ ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఎవరూలేని సమయంలో సైఫ్ ఇంట్లోకి ఓ దుండగుడు దొంగతనానికి చొరబడ్డాడు. ఈ క్రమంలో సైఫ్ ఆ దుండగుడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. సైఫ్ ని కత్తితో పొడిచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తాజాగా ఆయన సతీమణీ కరీనా కపూర్ ఈ విషయం పై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్
కరీనా కపూర్ పోస్ట్..
కరీనా కపూర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇలా రాసుకొచ్చారు.. మా కుటుంబానికి ఇది కష్టకాలం. ఈ కష్టసమయంలో మాకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. మీడియా వారందరూ ఊహాజనితమైన వార్తలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మాపై చూపిస్తున్న అభిమానాన్ని ఎంతో గౌరవిస్తున్నాం. కానీ, ఈ ఘటన నుంచి బయటపడే వరకు మా కుటుంబానికి కొంత వ్యక్తిగత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం అంటూ పోస్ట్ పెట్టారు.
వెన్నెముకతో పాటు ఆరు చోట్ల గాయాలు..
ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతో పాటు శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. సుమారు 5 గంటల పాటు శ్రమించిన వైద్యులు సైఫ్ వెన్నెముక నుంచి 2.5 అంగుళాల కత్తిని తొలగించారు. కత్తి ఇంకో అంగుళం దిగుంటే ఆయన పరిస్థితి మరింత విషమంగా మారేదని డాక్టర్స్ చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలోనే ఐసీయూ నుంచి జనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేయనున్నట్లు సమాచారం.
Also Read: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!