Microsoft: పాకిస్తాన్‌కు మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్.. అన్ని ఆఫీసులు బంద్.. ఎందుకో తెలుసా?

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జులై 3వ తేదీతో మైక్రోసాఫ్ట్ తన కార్యకలాపాలను పాక్‌లో పూర్తి చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఇంకా వెల్లడించలేదు.

New Update
Microsoft

Microsoft

ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2000 సంవత్సరంలో పాకిస్తాన్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించిన మైక్రోసాఫ్ట్ జులై 3వ తేదీతో తన కార్యకలాపాలను పూర్తి చేసినట్లు సమాచారం. కేవలం 25 సంవత్సరాల పాటు పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ తన సేవలను వినియోగించింది. అయితే ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇంకా ప్రకటించలేదు.

ఇది కూడా చూడండి:Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వరద బీభత్సం.. నీట మునిగిన ఆలయాలు

ఓ ఉద్యోగి ఈ విషయాన్ని..

మాజీ ఉద్యోగి జావేద్ రెహ్మాన్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 2000 నుంచి 2007 వరకు రెహ్మాన్ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు పాకిస్తాన్‌లో తమ ఆర్థిక కలాపాలను ముగించడంతో మంచి పని చేసిందని టెక్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పాక్‌లో ఎక్కువగా ప్రభుత్వాలు మారడం, శాంతి భద్రతలు లేకపోవడం, అస్థిర కరెన్సీ, అధిక పన్ను రేట్లు, వాణిజ్య విధానం వల్ల వెళ్లిపోవడమే మంచిదని అంటున్నారు. 

ఇది కూడా చూడండి:Unwanted Hair: ముఖంపై అవాంచిత రోమాలా! లేజర్ చికిత్స సురక్షితమేనా?

ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థికంగా దెబ్బతింది. 2024 ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ ఎగుమతులు దాదాపు 38.9 బిలియన్లు ఉండగా, దిగుమతులు 63.3 బిలియన్లకు చేరుకున్నాయి. దీనివల్ల 24.4 బిలియన్ల వాణిజ్య లోటు ఏర్పడింది. అయితే ఈ జూన్‌కి పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ విదేశీ మారక నిల్వలు 11.5 బిలియన్లకు తగ్గాయి. దీని వలన కంపెనీలు అవసరమైన హార్డ్‌వేర్‌ను దిగుమతి చేసుకోవడానికి కష్టంగా ఉంది. భారత్‌తో కూడా పాక్ వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. అయితే మైక్రోసాఫ్ట్‌తో పాటు మిగతా కంపెనీలు కూడా పాకిస్తాన్‌ను విడిచి వెళ్లే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చూడండి:Shubman Gill: దూకుడు మీదున్న శుభమన్ గిల్.. డబుల్ సెంచరీతో రికార్డు

Advertisment
Advertisment
తాజా కథనాలు