China Students Visa Cancel: చైనా విద్యార్థుల వీసాల రద్దు? ట్రంప్ సర్కార్ మరో నిర్ణయం

ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈరోజు అన్నీ సంలచన నిర్ణయాలే తీసుకుంటోంది. ఇప్పటికే విదేశీయుల వీసాల మీద కఠిన నిబంధనలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా చైనా విద్యార్థులను వీసాలను రద్దు చేయాలని ఆలోచిస్తోంది. 

New Update
usa

China students visas Cancel

China Students Visa Cancel: విదేశీ విద్యార్థుల మీద ఉక్కుపాదం మోపుతోంది అమెరికా(USA) అడ్మినిస్ట్రేషన్. ఇప్పటికే వీసాల ఇంటర్వ్యూలను ఆపేసింది. సోషల్ మీడియా తనిఖీలను చేస్తోంది ఇప్పుడు దాంతో పాటూ మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కూ రూబియో. చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేస్తామని చెప్పారు. దీనికోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా సిద్ధం చేశామని తెలిపారు. ముఖ్యంగా పరిశోధనా రంగాల్లో చదువుకుంటున్న వారితో పాటు, చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీతో సంబంధాలు ఉన్న విద్యార్థుల వీసాలే లక్ష్యంగా ఉన్నట్లు తెలిపారు.

విశ్వవిద్యాలయాలతో చైనా సంబంధాలు..

అమెరికాలో యూనివర్శిటీలపై ఇప్పటికే ట్రంప్ సర్కార్(Trump Government) ఒత్తిడి తెస్తోంది. విశ్వవిద్యాలయాల్లో అమెరికాకు వ్యతిరేకంగా పని చేస్తున్న విద్యార్థుల మీద నిఘా పెట్టాలని, వారి వీసాలను రద్దు చేసి వెనక్కు పంపేయాలని ఆర్డర్లు పాస్ చేసింది. ఇప్పుడు తాజాగా(Latest News) అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు చైనాతో సంబంధాలు తెంచుకోవాలనే ఒత్తిడి తెస్తోంది. అమెరికా నిధులతో నిర్వహిస్తున్న అధ్యయనాలను చైనా విద్యార్థులు తెలుసుకుంటున్నారని చాలా మంది ఆరోపిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు చైనా విద్యార్థుల వీసాలను రద్దు చేయాలని ఆలోచిస్తున్నామని మార్కూ రూబియో చెబుతున్నారు. అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారత్‌ తర్వాత స్థానం చైనాదే. 2023-24 విద్యా సంవత్సరంలో 2,70,000 మంది చైనా విద్యార్థులు చదువుకుంటున్నారు. 

Also Read: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

ట్రంప్ ప్రభుత్వం వరుసగా విదేశీ విద్యార్థులకు చెక్ పెడుతోంది. ఇంతకు ముందు పాలస్తీనా విద్యార్థులపై రూల్స్ ఇంపోజ్ చేసింది. ఇప్పుడు చైనా విద్యార్థులపై. యూఎస్ కు ప్రమాదకరం అనుకున్న దేశాల విద్యార్థులు ఎంత చిన్న తప్పు చేసినా... చివరకు ట్రాఫిక్ రూల్స్ ను తప్పినా కూడా వీసాలను రద్దు చేసేయమని చెప్పింది. రీసెంట్ గా హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు తీసుకొనే అనుమతిని కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఫెడరల్ కోర్టు దీనిని అడ్డుకుంది. 

Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

Also Read: Shock To Trump: ట్రంప్ టారీఫ్ లకు యూఎస్ ఫెడరల్ కోర్ట్ బ్రేక్..

Advertisment
Advertisment
తాజా కథనాలు