Palla vs kadiyam : అవును, నేను కుక్కనే...కానీ నువ్వు గుంట నక్కవు...పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కౌంటరిచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఓ గుంట నక్క.. తనను బొచ్చు కుక్క అని విమర్శిస్తోందని అన్నారు. 

New Update
Palla vs kadiyam

Palla vs kadiyam

Palla vs kadiyam :  "అవును, నేను కుక్కనే. నన్ను నమ్మిన కేసీఆర్ కు విశ్వాసమైన కుక్కలా ఉంటాను. కానీ ఒక పార్టీలో గెలిచి అధికారం కోసం మరో పార్టీలోకి దూకే కడియం శ్రీహరి లాంటి గుంట నక్కను మాత్రం కాదు" అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలపై జనగామ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కౌంటరిచ్చారు. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గుంట నక్క అని ఆయన మండిపడ్డారు.తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకోవడానికి కాపలా కుక్కలా పనిచేస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తాను ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు. ప్రజల భూములను కాపాడటంలో రేచు కుక్కలా ఉండి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

 బీఆర్‌ఎస్‌ రజతోత్సవాల్లో భాగంగా ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి.. మండల పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద నమ్మకం ఉంచి తనను గెలిపించిన ప్రజలు, నాయకులను కాపాడుకునేందుకు కాపలా కుక్కలా పనిచేస్తానని తెలిపారు. అలవిగాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ప్రశ్నించడంలో, ప్రజల భూములను కాపాడటంలో రేసు కుక్కలా ఉండి పోరాడతానని పేర్కొన్నారు.

Also Read: నగరంలో 16 ఏళ్ల బాలిక కిడ్నాప్.. కారులో తీసుకెళ్లి ఆ హోటల్‌లో అత్యాచారం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు