/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-03T183828.918-jpg.webp)
సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ ను ఈరోజుల్లో వాడని వారు ఉండరు. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, విండోస్ లలో గూగుల్ క్రోమ్ ను యూజ్ తెగ వాడేస్తుంటారు. తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ గూగుల్ క్రోమ్ యూజర్లకు ఓ పెద్ద అలర్ట్ ఇచ్చింది. మీరు Windows, Linux, Macలో Google Chromeని ఉపయోగిస్తుంటే వెంటనే వాటిని అప్ డేట్ చేసుకోవాల్సిందే.
Also Read: Starbucks Ceo: నాలుగు నెలలకు రూ.827 కోట్ల వేతనం..వారి కంటే ఈయనకే ఎక్కువ!
ఎమర్జెన్సీ రెస్పాన్స్...
లేకపోతే సైబర్ ముప్పు పొంచి ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ప్రకటించింది. గూగుల్ క్రోమ్ లో క్లిష్టమైన భద్రతా లోపాల గురించి ప్రభుత్వం హై-రిస్క్ హెచ్చరికను జారీ చేసింది.యూజర్లను గూగుల్ క్రోమ్ ను అప్ డేట్ చేసుకోవాలని కోరుతోంది. గూగుల్ క్రోమ్ లోని లోపాలతో హ్యాకర్స్ ఎటాక్ చేసే అవకాశాలున్నట్లు తెలిపింది.
Also Read: Hyderabad: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ నెయ్యి తింటే అంతే.. షాకింగ్ వీడియో!
యూజర్ల డేటా, సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసే అవకాశం ఉంటుందని సెర్ట్ పేర్కొంది. ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే అప్ డేట్ తప్పనిసరి అని చెప్పింది.పీసీలు, ల్యాప్‌టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్‌తో పాటు మాక్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.అయితే స్మార్ట్ ఫోన్ యూజర్లకు పెద్ద ప్రమాదమేమీ ఉండకపోవచ్చని చెప్పింది. 132.0.6834.83/8r, 132.0.6834.110/111కు ముందు వెర్షన్ గూగుల్ క్రోమ్‌ని వాడుతున్నట్లయితే తప్పనిసరిగా అప్‌డేట్ చేయాల్సిందేనని సెర్ట్ తేల్చి చెప్పింది.
ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లినక్స్ యూజర్లు 132.0.6834.110 వెర్షన్‌కు ముందు క్రోమ్ వాడుతున్నట్లయితే.. లేటెస్ట్ వెర్షన్‌కు మారాలని వెల్లడించింది.
Also Read: Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం!