/rtv/media/media_files/2025/01/26/JUOaiMfpLcQbQ9naTagh.jpg)
IST Time
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అధికారిక, వాణిజ్య రంగాల్లో ఒకేలా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST)ను వినియోగించడాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వినియోగదారుల మంత్రిత్వ శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14 వరకు ప్రజల అభిప్రాయాలను సేకరించనుంది. ఎవరైనా కూడా ఈ నిర్ణయంపై తమ అభిప్రాయాలను పంచకోవచ్చు. సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు.
Also Read: స్టార్‌లింక్ బీటా టెస్టింగ్ రేపే.. శాటిలైట్ నుంచి సెల్‌ఫోన్‌కు సిగ్నల్స్
కేంద్రం తాజాగా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన ప్రకారం.. కామర్స్, రవాణాశాఖ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లీగల్ కాంట్రాక్ట్స్, ఆర్థిక కార్యకలాపాలతో పాటు అన్ని రంగాలకు ఈ ఐఎస్‌టీ సమయాన్ని పాటించడం తప్పనిసరి చేస్తుంది. అధికారిక, వాణిజ్య పరంగా ఐఎస్‌టీ సమయ కాకుండా ఇతర సమయాన్ని పాటించడాన్ని నిషేధించడం, ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్‌స్టిట్యూషన్లలో తప్పనిసరిగా ఐఎస్‌టీ సమయాన్ని ప్రదర్శించడం లాంటి కీలక నిబంధనలు తాజాగా తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. జాతీయ మౌళిక సదుపాయలు, టెలికమ్యూనికేషన్స్ బ్యాంకింగ్, డిఫెన్స్, 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ లాంటి రంగాల్లో కచ్చితమైన సమయాన్ని పాటించాలనే ప్రయత్నంలో భాగంగానే తాజాగా ఈ ప్రతిపాదన వచ్చింది.
స్ట్రాటాజిక్, నాన్ స్ట్రాటాజిక్ రంగాల్లో నానోసెకండ్ల కచ్చితత్వంతో సమయాన్ని పాటించడం అత్యంత అవసరమని ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి అన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఖగోళ శాస్త్రం, నేవిగేషన్, శాస్త్రీయ పరిశోధన లాంటి ప్రత్యేకమైన రంగాలకు మాత్రం ఈ సమయ పాలనపై మినహాయింపు ఉండనుంది.
Also Read: మా స్కీమ్స్‌తో ప్రతి ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం: కేజ్రీవాల్
వినియోగదారుల వ్యవహారాల విభాగం.. నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ అండ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)తో కలిసి పటిష్టమైన సమయ విధానాన్ని, దానికి సంబంధించిన యంత్రాంగాన్ని అభివృద్ధి చేయనుంది. ఎవరైన ఈ ఐఎస్‌టీ సమయ పాలనకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి జరిమానా కూడా ఉండనుంది. కేంద్రం తీసుకున్న ఈ డ్రాఫ్టింగ్ రూల్స్‌పై ఫిబ్రవరి 14 వరకు ప్రజలు దీనిపై సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వీటిని స్వీకరించనుంది.