Fire Accident: ఘోర అగ్నిప్రమాదం.. 50 మందికి పైగా మృతి

యూరప్‌లోని నార్త్ మెసిడోనియాలో నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.

New Update
At least 51 dead after fire breaks out in North Macedonian nightclub

At least 51 dead after fire breaks out in North Macedonian nightclub

యూరప్‌లోని నార్త్ మెసిడోనియాలో నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా యత్నించాయి.      

Also Read: బోట్‌వాలాకు IT షాక్.. రూ.30 సరే ఇప్పుడు రూ.12.8 కోట్ల ట్యాక్స్ కట్టేదెలా..?

ఇక వివరాల్లోకి వెళ్తే.. నార్త్‌ మెసిడోనియా రాజధాని అయిన స్కోప్జేకు 100 కిలోమీటర్ల దూరంలో కొకాని అనే సిటీ ఉంది. ఇక్కడ పల్స్‌ నైట్‌క్లబ్‌లో శనివారం రాత్రి కాన్సర్ట్ జరిగింది. ఈ పార్టీకి దాదాపు 1500 మంది వచ్చారు. అయితే ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ వేడుకలో మండే స్వభావం గల వస్తువులను వినియోగించడం వల్లే సీలింగ్‌కు నిప్పు అంటుకొని మంటలు ఎగిసిపడ్డాయని తెలుస్తోంది. 

Also Read: పాకిస్థాన్‌ ఆర్మీ కాన్వాయ్‌పై బీఎల్‌ఏ దాడి.. 90 మంది సైనికులు మృతి!

మంటలు అంటుకోగానే క్లబ్‌లో ఉన్నవాళ్లందరూ హాహాకారాలు చేస్తూ భయాందోళనకు గురయ్యారు. పలువురు అందులో నుంచి పారిపోయారు. మరికొందరు అందులోనే చిక్కుకున్నారు. దీంతో 51 మంది చనిపోయారు. మరో 100 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందుస్తున్నారు.    

Also Read: భూమి మీదకు బయలుదేరిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు