USA: ఇండియన్స్‌ బిగ్ షాక్ ఇవ్వనున్న ట్రంప్..మరో 18వేల మంది..

అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. కానీ తాను ముందు నుంచీ చెబుతున్నట్టుగానే అక్రమ వలదారులను దేశం నుంచి సాగనంపుతున్నారు. తాజాగా మరో 18వేల మంది భారతీయులను పంపించేయనున్నారని తెలుస్తోంది. 

New Update

ఇండియన్స్‌కు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ బిగ్‌ షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు ముందు నుంచీ చెబుతున్నట్టుగానే అక్రమ వలసదారుల మీద కఠిన చర్యలు తీసుకోనున్నారు ట్రంప్. దీని వలన త్వరలోనే మరో 18 వేల మంది అక్రమ వలసదారులు ఇండియాకు రానున్నారని తెలుస్తోంది. వీరిలో చాలా మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌కు చెందినవారే ఉన్నారని తెలుస్తోంది. అక్రమ వలసదారులకు సంబంధించి ఇమ్మిగ్రేషన్‌ అండ్ కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌ ఇప్పటికే లిస్టు రెడీ చేసిందని చెబుతున్నారు.  

ప్రతీ ఆరుగంటలకు ఒక ఇండియన్..

యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్ కస్టమ్స్‌ వార్షిక నివేదికలో షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. దీని ప్రకారం ప్రతి ఆరు గంటలకు ఒక ఇండియన్‌ను అమెరికా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్ మెంట్  వెనక్కిపంపుతున్నట్టు తెలుస్తోంది. 2021తో పోలిస్తే 400 శాతం పెరిగిన బహిష్కరణ కేసులు పెరిగాయని నిఏదికలు చెబుతున్నాయి. మొత్తానికి అనుకున్నట్టుగానే  ట్రంప్ రాక భారతీయుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. 

Also Read: మళ్ళీ బిర్యానీనే టాప్..రెస్టారెంట్‌కు 5 లక్షల బిల్లు చెల్లించిన ఒక్కడు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు