కోవిడ్ తర్వాత ఆన్ లైన్ ఫుడ్ బిజినెస్ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ లేదా బంధువులు వస్తున్నారు అంటే రకరకాల వంటలు చేసేవారు. కానీ ఇప్పుడు సింపుల్‌గా ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. అది తింటూ ఆనందంగా సమయం గడుపుతున్నారు. అంతే కాదు రోజువారీ కూడా వంట చేసుకోవడం కొంత త్గింది. స్విగ్గీ, జొమాటోల్లో ఆర్డర్ పెట్టుకుని తినడం ఎక్కువైంది. చిన్న రోడ్డు పక్క హోటళ్ళ నుంచి పెద్ద పెద్ద రెస్టరెంట్ల వరకూ అన్నీ ఈ ఫుడ్ డెలివరీని ఎంకరేజ్ చేయడంతో...ఇప్పుడు అంతా ఈజీ అయిపోయింది. అయితే ఇలా ఆర్డర్ చేసిన వాటిల్లో మళ్ళీ బిర్యానీనే మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా తొమ్మిదో ఏడాదీ బిర్యానీనే అగ్రస్థానంలో నిలిచింది. అత్యధికంగా 9 కోట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి జొమాటో తెలిపింది. దీనికి సంబంధించి 2024 ఏడాదికి గానూ ఇయర్ ఎండ్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్, డైనింగ్ ట్రెండ్స్‌ను ప్రస్తావించింది. ఇది ఒక్క ఒమాటో ఇపోర్ట్ మాత్రమే...దే సవిగ్గీ ఇతర ఫ్లాట్ ఫామ్‌లు కలిపితే ఈ బిర్యానీ లెక్క మరింత ఎక్కువే అవుతుంది. ఇక బిర్యానీ తరువాత ప్లేస్‌ను పిజ్జా సొంతం చేసుకుంది. మొత్తం 5.84 కోట్ల పిజ్జాలను దేశవ్యాప్తంగా డెలివరీ చేసినట్లు జొమాటో తెలిపింది. అలాగే 77 లక్షల కప్పుల టీ, 74 లక్షల కప్పుల కాఫీని డెలివరీ చేసామని జొమాటో చెబుతోంది. ఒక్కడే 5లక్షల బిల్.. జొమాటో విడుదల చేసిన రిపోర్ట్‌లో మరో ఇంట్రస్టింగ్ విషయం బయటపడింది. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడంతో పాటూ రెస్టారెంట్లలో టేబుల్స్ బుక్ చేసుకుని, బిల్ పే చేసే సదుపాయం కూడా ఉంది. ఈ కేటగిరీలో ఫాదర్స్ డే నాడు అత్యధికంగా టేబుల్స్ బుక్ అయ్యాయని జొమాటో తెలిపింది. కుటుంబసమేతంగా ఆనంద క్షణాలను గడిపేందుకు మొత్తంగా 84,866 రిజర్వేషన్లు బుక్ అయ్యాయి. ఇందులో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఒక రెస్టారెంట్‌కు వెళ్లి ఏకంగా ₹5.13 లక్షల బిల్లును చెల్లించడం హైలెట్‌గా నిలిచింది. డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్లు ఈ స్థాయిలో చెల్లించడం ఇదే మొదటిసారి. Also Read: Cricket: ఇదేం మర్యాద...కోహ్లీని అవమానించిన ఆసీస్ అభిమానులు