USA Visa: బంగ్లాదేశ్ తో పాటూ 38 దేశాలపై అమెరికా ఉక్కు పాదం..వీసాలపై  పరిమితులు

బంగ్లాదేశ్ పై అమెరికా ఉక్కు పాదం మోపింది. అమెరికా వీసాపై పరిమితులను విధించింది. ఈ వీసా కావాలంటే 1.8 మిలియన్ల బంగ్లాదేశ్ టాకా బాండ్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పింది.  అమెరికా మొత్తం 38 దేశాలపై ఈ పరిమితులును విధించింది.

New Update
H-1B Visa Appointments Postponed For Many Indians Amid US' Social Media Rules

H-1B Visa Appointments Postponed For Many Indians Amid US' Social Media Rules

USA Visa: అమెరికా రీసెంట్ గా 75 దేశాలకు వీసాలు ఇవ్వమని చెప్పింది. ఇందులో భాగంగా మరిన్ని కఠిన నిబంధనలను పెడుతోంది. పాకిస్తాన్(pakistan) తర్వాత, బంగ్లాదేశ్(bangladesh) వీసాలకు అమెరికా గణనీయమైన దెబ్బ తగిలింది. కొత్త నిబంధనల ప్రకారం బంగ్లాదేశీయులు అమెరికాకు వీసా పొందాలంటే దాదాపు 1.4 లక్సల రూపాలయును కట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని బాండ్ గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందు పాకిస్తాన్ కు కూడా ఇలాంటి రూల్స్ నే పెట్టింది అమెరికా. దీని వలన ఆ దేశస్థులు అమెరికాలో స్థిరపడకుండా, పెళ్ళి చేసుకోకుండా నియంత్రించ వచ్చని యూఎస్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ చెబుతోంది. 

బాండ్ చెల్లించాలి..ప్రవర్తన సరిగ్గా ఉండాలి..

B1,  B2 వ్యాపార , పర్యాటక వీసాలు కోరుకునే బంగ్లాదేశ్ పౌరులు ఇప్పుడు జనవరి 21, 2026 నుండి $15,000 వరకు బాండ్ చెల్లించాల్సి ఉంటుందని ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ప్రకటించింది. $15,000 అంటే 1.363 మిలియన్ రూపాయలకు సమానం. కానీ బంగ్లాదేశ్ టాకాలో ఈ మొత్తం 1.834 మిలియన్ రూపాయలు. ఇది ఆ దేశ పౌరులకు చాలా ఎక్కువ మొత్తం. బాండ్ మొత్తం $5,000, $10,000 లేదా $15,000 కావచ్చు. వీసా ఇంటర్వ్యూలో ఇది ఖరారు చేయబడుతుందని అమెరికా ఎంబసీ తెలిపింది.  అయితే వీసా ఇంటర్వ్యూకు ముందు దరఖాస్తుదారులు ఎటువంటి బాండ్‌ను సమర్పించవద్దని రాయబార కార్యాలయం హెచ్చరించింది. ముందస్తు చెల్లింపులు చేయడం వీసా ఆమోదానికి హామీ ఇవ్వదని.. అటువంటి సేవలను అందించే మూడవ పార్టీ వెబ్‌సైట్‌లు స్కామ్‌లు కావచ్చని హెచ్చరించింది.దీంతో పాటూ బాండ్ నిబంధనల ప్రకారం.. ప్రభావిత వీసాదారులు న్యూయార్క్ JFK, వాషింగ్టన్ డాలెస్, లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రధాన విమానాశ్రయాలతో సహా మరికొన్ని ఎయిర్ పోర్ట్ ల ద్వారానే వీరు ప్రయాణించాల్సి ఉంటుంది. 

మొత్తం 38 దేశాలపై..

నియమాలన్నింటినీ కచ్చితంగా పాటిస్తేనే వీసాలు జారీ చేస్తామని అమెరికన్ ఎంబసీ చెప్పింది. అలాగే వీసా హోల్డర్ అమెరికాలో ఉన్నప్పుడు వీసా అవసరాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు తేలితే .. ఈ డబ్బు జప్తు చేయబడుతుందని చెప్పింది. ప్రవర్తన మంచిగా ఉండి, వారు అన్ని నిబంధనలు, షరతులకు అనుగుణంగా ఉంటేనే ఆ మొత్తం తిరిగి చెల్లించబడుతుందని తెలిపింది. ఇది కేవలం బీ1, బీ2 వీసాలకు మాత్రమే. మిగతా వీసాలను అంతకు ముందే ఇవ్వమని తేల్చి చెప్పింది. ఈ రకంగా వీసా బాండ్‌ను సమర్పించాల్సిన పౌరులు ఉన్న 38 దేశాల జాబితాను యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్‌తో పాటు  ఆఫ్రికా, ఆసియా, కరేబియన్, పసిఫిక్ దేశాలైన నైజీరియా, నేపాల్, భూటాన్, క్యూబా, సెనెగల్, వెనిజువెలా, జింబాబ్వే ఉన్నాయి. వీసా ఓవర్‌స్టే రేట్లను తగ్గించే లక్ష్యంతో చేపట్టిన పైలట్ కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది. 

Also Read: Students To USA: అమెరికానా నో వే అంటున్న విద్యార్థులు..75శాతానికి పడిపోయిన అడ్మిషన్లు

Advertisment
తాజా కథనాలు