/rtv/media/media_files/2025/08/29/students-2025-08-29-11-02-23.jpg)
Indian Students In USA
ఒకప్పుడు అమెరికా, ఇక్కడ విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యార్థులకు డ్రీమ్ డెస్టినేషన్. కానీ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు అమెరికాకు రావడానికి విద్యార్థులు జంకుతున్నారు. ఒకవేళ వద్దామని ప్రయత్నాలు చేసినా వీసాలు రాకపోవడం, సమయానికి వీసా ఇంటర్వ్యూలు దొరకకపోవడంతో రాలేకపోతున్నారు. మొత్తానికి అమెరికాకు వచ్చే భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెరికా యూనివర్శిటీల్లో భారతీయ విద్యార్థుల సంఖ్య 75 శాతానికి పడిపోయింది.
వీసా ఇబ్బందులు..
గత కొంత కాలంగా అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచే ఇది మొదలైందని చెప్పవచ్చును. అక్రమ వలసలను అరికట్టడంతో బాగంగా ట్రంప్ గవర్నమెంట్ వీసా రూల్స్ ను చాలా కఠినతరం చేసేసింది. దానికి తోడు వీసా ఇంటర్వ్యూ స్లాట్లలో జాప్యం, సోసల్ మీడియా వెట్టింగ్, పెద్ద సంఖ్యలో వీసాలను తిరసక్రించడం వంటి కారణాలతో కూడా విద్యార్థులు అమెరికాకు రాలేకపోతున్నారు. చాలా సందర్భాలలో విద్యార్థులు తమ కావాల్సిన టైమ్ లో ఇంటర్వ్యూ స్లాట్ లను పొందలేకపోయారు. దీని వలన వారు చివరి నిమిషంలో అన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది అని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు. గతేడాది ఆగస్టు, అక్టోబర్ నెలల మధ్యలో విద్యార్థుల తగ్గుదల ఎక్కవుగా నమోదైంది. ఈ కాలంలో భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు 70 శాతం తగ్గింది. ఫిబ్రవరి లేదా మార్చి నాటికి దరఖాస్తులు, వీసా ప్రక్రియలను పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే అమెరికాకు చేరుకోగలిగారు. తరువాత చేసుకున్న వారందరూ రాలేకపోయారు.
హెచ్ 1బీ ఫీజు ఎఫెక్ట్..
ఇక డిసెంబర్ 2025 నాటికి దాదాపు 8 వేల మంది విద్యార్థి వీసాలు రద్దు చేసినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ తెలిపింది. కొంత మంది విద్యార్థులకు సడెన్ గా, వెంటనే అమెరికాను వదిలి వెళ్ళిపోవాలన్న సూచనలు కూడా వచ్చాయి. మరోవైపు హెచ్ 1 బీ వీసా ఫీజులను పెంచడం కూడా విద్యార్థులు తగ్గడానికి కారణమైంది. చదువు అయిపోయిన తరువాత హెచ్ 1బీ వీసాకు అప్లై చేయాలంటే లక్ష డాలర్లు ఫీజు కట్టాలి. దీనికి కంపెనీలు ఏవీ ముందుకు రావడం లేదు. దాంతో అమెరికాలో ఉద్యోగాలు చేయడం కష్టమైంది. అమెరికాకు రావడానికి విద్యార్థులు అప్పులు చేసి, పెద్ద మొత్తంలో డబ్బులు కట్టి వస్తారు. అలాంటప్పుడు ఇక్కడ ఉద్యోగం దొరికితేనే వారు గెటాన్ అవగలుగుతారు. కానీ ఇక్కడ చదువుకుని వేరే చోటికి ఉద్యోగం కోసం వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. ఇలాంటి సమయంలో అమెరికాలో ఉద్యోగాలు దొరకనప్పుడు అక్కడకు చదువుకోవడానికి వెళ్ళడం ఎందుకు అనే ప్రశ్న కూడా విద్యార్థుల్లో తలెత్తుతోంది. దీని వలన కూడా చాలా మంది అమెరికాకు చదువుకోవడానికి రావడానికి భయపడుతున్నారని చెబుతున్నారు.
Also Read: Greenland Row: గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు..డెన్మార్క్ ను భయపెట్టడానికేనా?
Follow Us