US Elections 2024: ప్రజాస్వామ్యం కన్నా పైసలే ముఖ్యం.. ట్రంప్ ఆధిక్యంపై ఆసక్తికర సర్వే! ట్రంప్ కు ఓటు వేసిన వారిలో మెజారిటీ మంది తాము ఇన్ఫ్లుయేషన్, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్నామని చెబుతున్నారు. కమలకు ఓటు వేసిన వారు మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణే తమ ఫస్ట్ ప్రియారటీ అని చెప్పినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. By Nikhil 06 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి మరికొద్ది గంటల్లో అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల తది ఫలితాలు విడుదల కానున్నాయి. ప్రస్తుత ఫలితాల సరళిని పరిశీలిస్తే ట్రంప్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే.. ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. హారిస్ ఓటర్లలో మూడింట రెండు వంతుల మంది తాము వోటు వేయడానికి ప్రజాస్వామ్యం యొక్క భవిష్యత్తు చాలా ముఖ్యమైన అంశం అని చెప్పారు. అధిక ధరలు, ద్రవోల్భణం తదితర అంశాలను వీరు పెద్దగా పట్టించుకోలేదు. Also Read : US Elections: ఓటేసిన అమెరికా...అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్! ట్రంప్ ఓటర్లు మాత్రం ఆర్థిక సమస్యలు, వలసల నివారణ, ఇమ్మిగ్రేషన్ తదితర అంశాలకు మొగ్గు చూపారు . దాదాపు సగం మంది అధిక ధరలే తామ ఓటును నిర్ణయించిందని చెప్పారు. ట్రంప్ ఓటర్లలో మూడింట ఒక వంతు మంది మాత్రమే తమ ఓటుకు ప్రజాస్వామ్యం అత్యంత ముఖ్యమైన అంశం అని చెప్పారు. Also Read : పవన్ రియల్ 'గబ్బర్ సింగ్' అవుతాడా? వారందరి లెక్కలు తేలుస్తాడా?.. నెట్టింట కొత్త చర్చ గెలిస్తే ఆర్థిక విధానంలో భారీ మార్పులు.. డొనాల్డ్ ట్రంప్ తాను మళ్లీ ఎన్నికైతే ఆర్థిక విధానంలో భారీ మార్పులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అతని హామీలలో దిగుమతులపై అధిక సుంకాలు, సామాజిక భద్రతా ప్రయోజనాలపై పన్నుల తొలగింపు, కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు తదితర అంశాలు ఉన్నాయి. ట్రంప్ అన్ని దిగుమతులపై సుంకాలు విధిస్తానని చెప్పారు. ఈ సుంకాలు అమెరికన్ ఉద్యోగాలను కాపాడతాయని, విదేశీ దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గిస్తుందని ఆయన వాదించారు. ట్రంప్ వాదనలకు మెజార్టీ ఓటర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆధిక్యంలో దూసుకుపోతున్నట్లు స్పష్టం అవుతోంది. Also Read : 'తండేల్' రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన.. చైతూ, సాయి పల్లవి ఎమోషనల్ పోస్టర్ Also Read : Tsunami Awareness Day: సునామీ గురించి ఈ భయంకరమైన విషయాలు తెలుసా..! #donald-trump #inflation #kamala-haaris #us election 2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి