పవన్ రియల్ 'గబ్బర్ సింగ్' అవుతాడా? వారందరి లెక్కలు తేలుస్తాడా?.. నెట్టింట కొత్త చర్చ

సినిమాల్లో పవన్ ఖాకీ చొక్కా వేశాడంటే ఆయన డైలాగ్స్ తోనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. అలాంటిది నిజ జీవితంలో ఆయన చేతిలో నిజంగానే పోలీస్ డిపార్ట్మెంటే ఉంటే?.. సోషల్ మీడియాలో ఇప్పుడిదే డిస్కషన్ నడుస్తోంది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

New Update
sdfsdfsd

'నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది'.. 'గబ్బర్ సింగ్' సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇది. పవన్ ఖాకీ చొక్కా వేశాడంటే ఆయన మాటలతోనే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. అలాంటిది నిజ జీవితంలో ఆయన చేతిలో నిజంగానే పోలీస్ డిపార్ట్మెంటే ఉంటే?.. సోషల్ మీడియాలో ఇప్పుడిదే డిస్కషన్ నడుస్తోంది. ఈ డిస్కషన్ రావడానికి కారణం ఇటీవల ఏపీ హోమ్ మినిష్టర్ వంగల పూడి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యలే.

ఇటీవల ఓ సమావేశంలో పవన్ మాట్లాడుతూ.. ఏపీలో లా అండ్ ఆర్డర్, పోలీస్ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదని, తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరించారు. దీంతో సోషల్ మీడియాలో కొత్త రచ్చ మొదలైంది. నిజానికి ఇటీవల ఏపీ ఎలక్షన్స్ లో గెలిచినా తర్వాత పవన్ కు హోం శాఖ ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో అభిమానులతో పాటూ సాధారణ ప్రజలు కూడా ఇది నిజమైతే రాష్ట్రంలో అరాచకాలకు అడ్డుకట్ట పడుతుందని అనుకున్నారు.

Also Read : పూరీకి హీరో దొరికేసాకాడోచ్.. ఈసారైనా హిట్ కొడతాడా?

 హోమ్ శాఖ అయితే పర్ఫెక్ట్..

పవన్ బాడీ లాంగ్వేజ్, ఆయన ఆటిట్యూడ్ కు హోమ్ శాఖ అయితే పర్ఫెక్ట్ అని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయ పడ్డారు. అయితే చంద్రబాబు మాత్రం ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఓ మహిళా తన కూతురు కనిపించడం లేదని, పవన్ సాయం కోరితే.. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి.. సీఐ తో వీడియో కాల్ లో మాట్లాడి కేస్ సాల్వ్ చేశాడు. 

అలాంటిది పోలీస్ డిపార్ట్ మెంట్ ఆయన చేతుల్లో ఉండే అలంటి కేసులే ఉండకుండా చేస్తాడని అప్పట్లో ఫ్యాన్స్ ఆయనపై ప్రశంసలు కురిపించారు.ఇక ఇటీవల హోం మినిష్టర్ పై పవన్ వ్యాఖ్యలతో మళ్లీ అభిమానుల్లో ఆశలు చిగురించాయి. 

Also Read : 'తండేల్' రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన.. చైతూ, సాయి పల్లవి ఎమోషనల్ పోస్టర్

చెప్పినట్లు గానే పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ అయితే బాగుంటుందని, అదే జరిగితే ఏపీలో చిన్నారులపై అఘాయిత్యాలు, ఆడ పిల్లలపై మానభంగాలు ఆగుతాయని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. దీనికి నెటిజన్స్ కూడా సపోర్ట్ చేస్తూ తమ అభిప్రాయాలను పోస్టుల రూపంలో తెలియజేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు