US Elections: ఓటేసిన అమెరికా...అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్! ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెరికా ఎన్నికలు జోరుగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ ఎన్నికల్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. By Bhavana 06 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి US Elections: మొన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పోలింగ్ జోరుగా కొనసాగుతుంది. అగ్రరాజ్యానికి 47 వ అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు మంగళవారం కోట్ల మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. Also Read: ఇండియన్ల మద్దతు ట్రంప్‌కేనా..? అర్థరాత్రి వరకూ కొనసాగుతుంది. అంటే భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం 9 గంటలకు వరకూ జరగనున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సుమారు 16 కోట్ల మంది నమోదు చేసుకోగా వారిలో 8.2 కోట్ల మంది మంగళవారం కంటే ముందుగానే వారి ఓటు హక్కును వినియోగించుకుని ఓటేశారు. Also Read: USA Elections 2024: ఎన్నికల వేళ ట్రంప్ కీలక ట్వీట్.. సగం ఓట్ల కంటే కూడా... అంటే గత ఎన్నికలలో పోలైన సగం ఓట్ల కంటే కూడా ఎక్కువే. ఈసారి అధ్యక్ష బరిలో నిలిచిన అటు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ఇద్దరి మధ్య కూడా పోటీ హోరాహోరిగా సాగుతుంది. దీనికి నిదర్శనంగా అతి చిన్న పోలింగ్ కేంద్రమైన డిక్స్‌విల్లే నాచ్ లో రిజల్ట్ ఏకంగా టై అయి కూర్చుంది. ఇద్దరికి కలిపి చెరో 3 ఓట్లు వచ్చాయి. Also Read: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ అమెరికాలోనే కీలక రాష్ట్రాలైన జార్జియా, నార్త్ కరోలినాలో రికార్డు స్థాయిలో ముందస్తు పోలింగ్ జరిగినట్లు సమాచారం. ఫ్లోరిడాలో భార్య మెలానియాతో కలిసి డొనాల్డ్ ట్రంప్ ఓటేశారు. ఆ తరువాత వారు ఎస్టేట్ కు వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలో కమలా హారిస్ మెయిల్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. Also Read: మెగా డిఎస్సీ కి పారదర్శకంగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు..లోకేశ్ ఆదేశాలు జార్జియాలో ముందుగానే 40 లక్షల మంది ఓటేయడంతో అక్కడి పోలింగ్ కేంద్రాలన్ని కూడా బోసిపోయినట్లున్నాయి. రిపబ్లికన్ లు ముందస్తు ఓటింగ్ లో అధికంగా పాల్గొన్నట్లు అంచనా. హ్యుస్టన్, ఒమాహా, నెబ్రాస్కాల్లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గొడుగులతో పోలింగ్ కేంద్రాల వద్ద దర్శనమిచ్చారు...ఓటర్లు. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ ఓటర్లు ముందస్తు ఓటింగ్ లో అధికంగా పాల్గొన్నారని తెలుస్తుంది. కొలరాడో, మోంటానాల్లో మంచునూ సైతం లెక్కచేయకుండా జనం క్యూలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోల్ బుక్ పని చేయకపోవడంతో పోలింగ్ లేట్ అయ్యింది. ఈసారి ఎన్నికల్లో గట్టిపోటీనే ఉందని, ఓటర్లంతా కూడా పోలింగ్ లో పాల్గొనాలని మాజీ అధ్యక్షుడు ఒబామా పిలుపునిచ్చారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి