ముద్రగడ నన్ను 50లక్షలు మోసం చేసాడు.. | Mudrgada Padmanabham House Attack | RTV
ట్రంప్ కు ఓటు వేసిన వారిలో మెజారిటీ మంది తాము ఇన్ఫ్లుయేషన్, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకున్నామని చెబుతున్నారు. కమలకు ఓటు వేసిన వారు మాత్రం ప్రజాస్వామ్య పరిరక్షణే తమ ఫస్ట్ ప్రియారటీ అని చెప్పినట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.
సాధారణంగా మనం సేవింగ్స్ చేసేటప్పుడు పదేళ్ల తరువాత 10 లక్షలు వస్తే సరిపోతాయనుకుంటాం. కానీ, ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం కారణంగా ఆ పదేళ్ల తరువాత పది లక్షల రూపాయల విలువ బాగా తగ్గొచ్చు. అందుకే సేవింగ్స్ విషయంలో ద్రవ్యోల్బణం ఎలా లెక్కించాలో ఈ ఆర్టికల్ తెలుసుకోవచ్చు
ఆర్థిక సంక్షోభంతో పాకిస్థాన్ కొట్టుమిట్టాడుతోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో నిత్యవసర ధరల వస్తువులు ఆకాశాన్ని తాకున్నాయి.రేట్లు ఆమాంత పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలో పిండి రూ.800, లీటర్ పాలు రూ.210, బియ్యం రూ.200 నుంచి 400 వరకు పెరిగాయి.
విపరీతంగా పెరిగిపోతున్న గ్లోబల్ వార్మింగ్ తో భవిష్యత్తులో ఆహార వస్తువుల ధరలు ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహార ద్రవ్యోల్బణం రేటు ప్రతి సంవత్సరం 3.2 శాతం పాయింట్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో స్వల్పంగా తగ్గింది. జనవరి నెలలో 5.10 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండగా.. ఫిబ్రవరిలో అది 5.09గా నమోదు అయింది. రిజర్వ్ బ్యాంక్ మధ్యకాలిక లక్ష్యం 4 శాతం కాగా, దానికంటే చాలా ఎక్కువగా ఫిబ్రవరి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు అయింది.
ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి అనుకుంటున్న ఉల్లి ధరలు త్వరలో మళ్ళీ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఉల్లి పంట తక్కువగా అందుబాటులోకి రావడం.. రంజాన్ పండుగ.. డిమాండ్ పెరిగే అవకాశంతో మార్చి 15 తరువాత ఉల్లిధరల్లో పెరుగుదల కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు.