/rtv/media/media_files/2024/11/05/NAXH6qb5OscxWEPz4ygy.jpg)
నాగ చైతన్య 'లేటెస్ట్ మూవీ 'తండేల్' రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఫిబ్రవరి 7న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను వదిలారు. 'ప్రేమ తీరం నుండి భావోద్వేగాలతో నిండిన సముద్రానికి ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి..' అంటూ తీరపు అలల మధ్య సాయిపల్లవి, నాగచైతన్య ఎమోషనల్‌గా ఒకరికొకరు హగ్ చేసుకున్న స్టిల్‌ను షేర్ చేశారు.
Also Read : వామ్మో.. 'కంగువా' అన్ని వేల స్క్రీన్స్ లో రిలీజ్ అవుతుందా?
ఈ పోస్టర్ తో సినిమా చాలా ఎమోషనల్ గా ఉంటుందని అర్థం అవుతుంది. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో నాగచైతన్య, సాయిపల్లవి, దర్శకుడు చందూ మొండేటీలతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసులు పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగ చైతన్య మాట్లాడుతూ..' నా కెరీర్‌లో ఇప్పటి వరకు రిలీజ్ డేట్‌ను ముందుగా అనుకొని..దాన్ని బట్టి సినిమా పూర్తిచేసేవాడిని.
Get ready to sail from the shores of love to the ocean full of emotions ✨#Thandel GRAND RELEASE WORLDWIDE ON FEBRUARY 7TH, 2025 ❤️🔥#ThandelonFeb7th - https://t.co/KSkvscE3co #Dhullakotteyala 🔥🤙
— Geetha Arts (@GeethaArts) November 5, 2024
Yuvasamrat @chay_akkineni @Sai_Pallavi92 @chandoomondeti @ThisIsDSP… pic.twitter.com/TQBEOWLK1q
Also Read: హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!
'తండేల్' ఒక గొప్ప సినిమా..
దాని వల్ల తప్పులు జరిగేవి. సినిమా మొత్తం పూర్తయ్యాక రిలీజ్ డేట్ చెబితే బాగుండేదని అనుకునేవాడిని. ఈ చిత్రంతో అది నెరవేరింది. అల్లు అరవింద్ కూడా ఇలానే ఆలోచించారు. చాలా ఆనందించాను. ఇది గొప్ప చిత్రం. శ్రీకాకుళంలో కొందరు మత్స్యకారుల జీవితం. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా అది పండగే అవుతుంది. మంచి సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉన్నాం.
Also Read : గ్రాండ్ గా 'గేమ్ ఛేంజర్' టీజర్ లాంచ్ ఈవెంట్.. ఎప్పుడు, ఎక్కడంటే?
గీతా ఆర్ట్స్‌లో ఈ స్టోరీ లైన్ గురించి వినగానే నాకు చేయాలని అనిపించింది. నేను చేస్తానని బన్నివాసుని అడిగాను. పాత్ర గురించి తెలుసుకోవాలని శ్రీకాకుళం వెళ్లి మత్స్యకారులతో గడిపాం. నన్ను తెరపై బాగా చూపించాలని చందూ కష్టపడ్డారు. ఆయన నాకు మంచి స్నేహితుడితో సమానం. సాయి పల్లవితో డ్యాన్స్ చేయడం చాలా కష్టం. ఆమె క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్..' అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్.. నిఖిల్ చేసిన పనికి యష్మీ ఎలిమినేటెడ్..!