US Attacks : యెమెన్‌పై అమెరికా వైమానిక దాడులు..ఎంతమంది చనిపోయారంటే.

యెమెన్‌పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా యెమెన్‌లోని కీలక ప్రాంతమైన రాస్‌ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా వైమానిక దళం విరుచుకుపడింది. ఈ దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది.

New Update
US Attacks

US Attacks

US Attacks : యెమెన్‌లోని కీలక ప్రాంతమైన రాస్‌ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా విరుచుకుపడింది. అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ దాడులను అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్‌తో పాటు హౌతీ ఆరోగ్య శాఖ కూడా ధ్రువీకరించింది. రాస్‌ ఇసా చమురు పోర్టు యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న విషయం తెలిసిందే. 

Also Read: Gold: లక్షకు చేరువలో బంగారం.. ధర తగ్గే ఛాన్స్ ఉందా? కొనేందుకు ఇది సరైన సమయమేనా?

Also Read: Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు...సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా పైకి..

హౌతీలకు ఇంధనాన్ని అందించే స్థావరాన్ని ధ్వంసం చేయడానికి, వారి ఆదాయ వనరులను దెబ్బతీయడానికే ఈ దాడులు నిర్వహించామని అమెరికా ప్రకటించింది. కానీ యెమెన్‌లోని ప్రజలకు ఎలాంటి హానీ తలపెట్టలేదని వివరించారు. మార్చి 15న హౌతీలపై యుద్ధం ప్రకటించిన తర్వాత ఇదే అతిపెద్ద దాడని తెలిపారు.

  Also Read: Madhya Pradesh: భర్తను 36 సార్లు కత్తితో పొడిచి..ప్రియుడికి వీడియో కాల్ లో చూపించిన మైనర్‌ భార్య!


గత నెల 17న కూడా హౌతీలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. యెమెన్‌ రాజధాని సనా, సదా, హౌతీల బలమైన ప్రాంతం అల్‌బేద్‌, రాడాలపై అమెరికా సేనలు శనివారం బాంబుల వర్షం కురిపించాయి. ఎర్రసముద్రంలో అగ్రరాజ్య నౌకపైకి హౌతీలు దాడికి సమాధానంగా అమెరికా పెద్దయెత్తున జరిపిన బాంబు దాడుల్లో 31 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. బాంబు దాడులతో ఆయా ప్రాంతాలు భూకంపం వచ్చినట్టు కంపించిపోయాయని స్థానికులు తెలిపారు. కాగా, ‘మీ టైం అయిపోయింది. ఈ రోజు నుంచే మీ దాడులను నిలిపివేయండి. అలా చేయకపోతే ఇంతకుముందెన్నడూ చూడని విధంగా నరకాన్ని చవిచూస్తారు. తమ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోకుంటే ఎప్పుడు చూడని రీతిలో బాంబుల వర్షం కురిపిస్తాం. ప్రపంచంలోని జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తీ ఆపలేదు’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హౌతీలను హెచ్చరించారు.

Also Read: రాజీవ్ యువ వికాసంతో యువకుల జీవితాలు మారుతాయి: భట్టి

Also Read :  బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఆ నలుగురు ఔట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు