Russia-Ukraine War: రష్యాకు బిగ్ షాక్.. ఆయిల్ రిఫైనరీని పేల్చేసిన ఉక్రెయిన్

తాజాగా రష్యాకు ఉక్రెయిన్‌ బిగ్ షాక్ ఇచ్చింది. రష్యా ఆయిల్‌ రిఫైనరీని పేల్చేసింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అయితే రష్యన్ సైనిక అవసరాలు తీర్చేందుకు ఇక్కడి నుంచే ఇంధనం సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

New Update

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రష్యాకు ఉక్రెయిన్‌ బిగ్ షాక్ ఇచ్చింది. రష్యా ఆయిల్‌ రిఫైనరీని పేల్చేసింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అయితే రష్యన్ సైనిక అవసరాలు తీర్చేందుకు ఇక్కడి నుంచే ఇంధనం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు మిలిటరీ ఎయిర్‌బేస్‌తో పాటు ఎలక్ట్రానిక్ ఫ్యాక్టరీపై ఉక్రెయిన్‌ దాడులకు పాల్పడింది. ఇక రష్యాకు సమీపంలో రెండు అమెరికన్ అణు జలాంతర్గాములు కూడా రంగలోకి దిగాయి. అమెరికా ప్రవేశంతో రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Also Read: పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ కొత్త వ్యూహం.. అప్రమత్తమైన భారత్

 Also read: 'వారానికి 80 గంటలు పనిచేయాలి'.. మరో వ్యాపారవేత్త కీలక ప్రకటన

అయితే పశ్చిమ దేశాల భద్రతను బలోపేతం చేయడానికి అమెరికా న్యూక్లియర్ సబ్‌ మెరైన్లను రష్యా సమీపంలో మోహరించాలని ట్రంప్‌ ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది అమెరికా, రష్యా మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచే ఛాన్స్ ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. రష్యాకు అమెరికా శక్తి, సామర్థ్యాన్ని చూపించేందుకే ఇలా ట్రంప్ ఇలా చేశాడని కొందరు భావిస్తున్నారు. 

దీనిపై రష్యా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత భద్రతా మండలి ఉపాధ్యక్షుడు మెద్వదేవ్ కూడా స్పందించారు. ట్రంప్ చర్యలను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రష్యా ఎలాంటి పరిస్థితుల్లో కూడా తమ విధానాన్ని మార్చుకోదని తేల్చిచెప్పారు. సోవియట్ కాలం నుంచి రష్యా అణ్వాయుధాలను కలిగి ఉందని తెలిపారు. తమ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు.  

Also Read: వీదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.?. బంపర్‌ ఆఫర్‌.. రూ.1 కే వీసా

Advertisment
తాజా కథనాలు