రష్యాలో ఉద్రిక్తత.. మాస్కోపై 34 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్..

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. మొత్తం  34 డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఈ స్థాయిలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం ఇదే మొదటిసారి.

Russia Attack
New Update

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. మొత్తం  34 డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఇంతటి స్థాయిలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్ దాడులతో రష్యా అలెర్ట్ అయ్యింది. మాస్కోలోని డొమోడెడోవో, జుకోవో విమానాశ్రయాలను తాత్కాలికంగా నిలిపివేసింది.    

Also Read: లెబనాన్‌తో కాల్పుల విరమణ.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం !

ప్రతీకారం తీర్చుకుంటాం

 మరోవైపు ఉక్రెయిన్ దాడులను రష్యా కూడా ధృవీకరించింది. ఉక్రెయిన్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పుడు దాడి చేస్తుందో అనేదానిపై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేసి దాదాపు రెండున్నరేళ్లు దాటింది. ఇరు దేశాలు పరస్పర దాడులతో ఇంకా విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఇరువైపులా కూడా పెద్దఎత్తున ప్రాణనష్టం జరుగుతోంది. అయితే యుద్ధం మొదలైనప్పటి నుంచి చూస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో రష్యా దళాలు అత్యధిక ప్రాణనష్టం చవిచూసినట్లు తెలుస్తోంది.   

Also Read: భారత్ లో నాసిరకం ఫుడ్ ప్రొడెక్ట్స్.. బయటకొచ్చిన సంచలన రిపోర్ట్!

యుద్ధక్షేత్రంలో రష్యా భారీ సంఖ్యలో సైన్యాన్ని కోల్పోతుందని బ్రిటన్ చీఫ్ డిఫెన్స్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ సర్‌ టోని రాడాకిన్‌ ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో చెప్పారు. అక్టోబర్‌లో మృతి చెందిన, గాయాలపాలైన వారి సంఖ్య రోజుకు సగటున 1500లుగా ఉందని తెలిపారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటిదాకా ఏడు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. అధ్యక్షుడు పుతిన్ ఆశయాల కోసం అక్కడి ప్రజలు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారని తెలిపారు. రష్యా తన ప్రభుత్వ ఖర్చులో 40 శాతానికి పైగా రక్షణ, భద్రతల కోసమే ఖర్చు చేస్తోందని వెల్లడించారు. 

Also Read: కెనడా హిందూ ఆలయంపై దాడి కేసు.. అరెస్టయిన గోసల్‌ విడుదల!

Also Read: స్విట్జర్లాండ్‌ లో బురఖా పై నిషేధం ఎప్పటి నుంచి అంటే!

#telugu-news #russia #russia-ukraine #russia-ukraine-war
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe