Israel-Lebanon: లెబనాన్‌తో కాల్పుల విరమణ.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం ! ఇజ్రాయెల్- లెబనాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 10 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఇజ్రాయెల్- లెబనాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధ వాతారణంలో ప్రస్తుతం పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర సరిహద్దులోని లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణ చేసేందుకు ఇజ్రాయెల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు వార్తా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పంద వివరాల గురించి ఇంకా తెలియలేదు. గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపేయాలని లేకపోతే టెల్‌అవీవ్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) పలు ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Also Read: స్విట్జర్లాండ్ లో బురఖా పై నిషేధం ఎప్పటి నుంచి అంటే! ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఉత్తర లెబనాన్‌తో పరిమిత కాల్పుల విరమణకు ఆలోచిస్తున్నట్లు వార్తా కథనాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఇజ్రాయెల్.. లెబనాన్‌పై జరిపిన దాడుల్లో 3,136 మంది మృతి చెందారు. మరో 13,978 గాయాలపాలయ్యారు. వీళ్లలో 619 మంది మహిళలు, 194 మంది చిన్నారులు కూడా ఉన్నారు. మరోవైపు ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియాలో ఇజ్రాయెల్ ఓ ఇంటిపై ఆదివారం తెల్లవారుజామున దాడులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో సుమారు 32 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. Also Read: కెనడా హిందూ ఆలయంపై దాడి కేసు.. అరెస్టయిన గోసల్ విడుదల! హెజ్‌బొల్లా దళాలను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులు చేస్తూనే ఉంది. రోజురోజుకు ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో హెజ్‌బొల్లా కుదేలవుతుంది. ఇప్పటికే ఆ సంస్థ అధినేతలు హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్‌తో పాటు పలువురు కీలక నేతలు కూడా ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందారు. మరోవైపు హెజ్‌బొల్లా ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా సపోర్ట్ చేసే ప్రాంతాలకు సమీపంలో ఉంటున్న ప్రజలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. మరీ ఇప్పుడు ఉత్తర లెబనాన్‌లో ఇజ్రాయెల్ పరిమిత కాల్పుల విరమణకు ముందుకొస్తుందా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. Also Read: లెబనాన్‌తో కాల్పుల విరమణ.. ఇజ్రాయెల్ కీలక నిర్ణయం ! Also Read: TSPSC Group 3 Hall Tickets: గ్రూప్-3 హాల్ టికెట్లు విడుదల #telugu-news #international-news #israel #gaza #lebanon మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి