భారత్ లో నాసిరకం ఫుడ్ ప్రొడెక్ట్స్.. బయటకొచ్చిన సంచలన రిపోర్ట్! పెప్సికో, యూనిలీవర్, డానోన్ వంటి గ్లోబల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంపెనీలు భారతదేశం సహా ఇతర తక్కువ ఆదాయ దేశాలలో తక్కువ ఆరోగ్యవంతమైన ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని గ్లోబల్ పబ్లిక్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్ (ATNI) ఆరోపిస్తుంది. By B Aravind 10 Nov 2024 | నవీకరించబడింది పై 10 Nov 2024 15:58 IST in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి పెప్సికో, యూనిలీవర్, డానోన్ వంటి గ్లోబల్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ దిగ్గజ కంపెనీల గుట్టు బయటపడింది. ఈ కంపెనీలు అనారోగ్యకరమైన ఉత్పత్తులు విక్రయిస్తున్నాయని ఓ నివేదికలో బయటపడింది. అది కూడా తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు వీటిని సరఫరా చేస్తున్నట్లు తేలింది. గ్లోబల్ పబ్లిక్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ యాక్సెస్ టు న్యూట్రిషన్ ఇనిషియేటివ్ (ATNI) అనే నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ఇథియోపియా, ఘానా, ఇండియా, కెన్యా, నైజీరియా, పాకిస్థాన్, పిలిప్పైన్స్, టాంజానియా, వియాత్నం లాంటి దేశాలకు ఈ తక్కువ ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్‌ను ఎగుమతి చేయడం ఆందోళన రేపుతోంది. Also Read: దారుణం.. టీచర్లు బ్లాక్ మెయిల్ చేస్తూ నీట్ విద్యార్థిపై.. వాస్తవానికి అన్ని ప్రొడక్ట్స్‌కు కూడా హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఒక ప్రొడక్ట్‌కు 5 పాయింట్లు వచ్చాయంటే అది బెస్ట్ స్కోర్‌గా పరిగణిస్తారు. ఇక 3.5 కన్నా ఎక్కువ రేటింగ్ వస్తే ఆ ప్రొడక్ట్ ఆరోగ్యకరంగా ఉన్నట్లు భావిస్తారు. అయితే తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో ఫుడ్ కంపెనీల ప్రొడక్ట్స్‌ల రేటింగ్ కేవలం 1.8గా ఉంది. మరోవైపు ఎక్కువ ఆదాయం ఉండే దేశాల్లో ఫుడ్ ప్రొడక్ట్స్‌ల రేటింగ్ 2.3గా ఉంది. అయితే ఈ అంశంపై డానోన్ కంపెనీకి చెందిన క్వాలిటీ అండ్ ఫుడ్ సెఫ్టీ అధికారి ఇసాబెల్లె ఎస్సర్ స్పందించారు. '' మేము ఇంకా వ్యాపార, పారిశ్రామిక స్థాయిలో చేయాల్సింది చాలా ఉందని అంగీకరిస్తున్నాం. మా ఉత్పత్తుల నాణ్యతను పెంచేందుకు, ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్‌ను తయారుచేసేందుకు కట్టుబడి ఉన్నాము. ఆరోగ్య, పోషక అవసరాలను తీర్చడానికి, మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి సైన్స్‌లో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తామని'' ఇసాబెల్లె ఎస్సర్ అన్నారు. మరోవైపు పెప్సికో, హెచ్‌యూఎల్ కంపెనీలు మాత్రం తాజాగా విడుదలైన నివేదికపై ఇంతవరకు స్పందించలేదు. Also Read: అయ్యప్ప భక్తులకు అలర్ట్..ఇక నుంచి ఆ వస్తువులకు నో ఎంట్రీ! ఇదిలాఉండగా.. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో బరువు తగ్గే మందులు వాడటం పెరగడం వల్ల ప్యాకేజ్డ్ ఫుడ్స్ రంగానికి సమస్యలు ఏర్పడుతున్నాయి. ఫుడ్ కంపెనీలు కొత్త ప్రొడక్ట్స్‌ను చూసుకొనేలా ఒత్తిడి పెరుగుతోంది. అనేక బహుళ జాతి సంస్థలు కూడా అధిక ఆదాయం ఉన్న దేశాల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాల నుంచే ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయి. ఇక భారత్‌లో అయితే జాతీయ ఆహార నియంత్రణ సంస్థ.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSI) కూడా ప్యాకెజ్డ్ ఫుడ్స్ కంపెనీలకు తమ ప్రొడక్ట్స్‌పై షుగర్, ఉప్పు, కొవ్వు ఎంత ఉంటుంది అనే పోషకాహార సమాచారాన్ని ఇవ్వాలనే విధానాన్ని తీవ్రతరం చేస్తోంది. ఇది కూడా చూడండి: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ ఇది కూడా చూడండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి #ATNI #PepsiCo #india #health మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి