UK: భారత రెస్టారెంట్లను టార్గెట్ చేసిన బ్రిటీష్ ప్రభుత్వం

అమెరికాలానే భిట్రన్ కూడా అక్రమవలదారులను వెనక్కు పంపేస్తోంది. ఇందులో భాగంగా భారతీయ రెస్టారెంట్ లను టార్గెట్ చేసారు అధికారులు. వాటిల్లో పని చేస్తున్న భారతీయులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

New Update
immigrants

UK Targets Indian Restaurants

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని అక్కడి ప్రభుత్వం పంపిస్తోంది. ఇటీవల 200 మందికి పైగా భారతీయ అక్రమ వలసదారులను కూడా సైనిక విమానంలో వెనక్కి తరలించింది. మరో 600 మందిని తరలించేందుకు సిద్ధమవుతోంది. అయితే అక్రమ వలసదారుల అంశంలో అమెరికా బాటలోనే బ్రిటన్ కూడా వెళ్తోంది. బ్రిటన్‌లోకి అక్రమంగా వచ్చి ఉద్యోగం చేసుకుంటున్న 600 మందికి పైగా వలసదారులను అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది.

Also Read: ఓపెన్ ఏఐ కు భారీ ఆఫర్ ఇచ్చిన మస్క్...మీరే ఎక్స్ ను అమ్మండన్న శామ్ వాల్టన్

టార్గెట్ ఇండియన్ రెస్టారెంట్స్..

ఇప్పుడు మరింత మంది అక్రమ వలసదారులను పట్టుకునేందుకు భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేసింది బ్రిటన్ ప్రభుత్వం.  యూకే వైడ్ బ్లిట్జ్‌ పేరుతో ఇండియన్ రెస్టారెంట్లలో భారీ ఎత్తున సోదాలు చేపట్టింది. దాంతో పాటూ కార్ వాష్ ఏరియాలు. గ్రోసెరీ, కన్వీనియెంట్ స్టోర్స్, బార్ లలో కూడా తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో ఒక రెస్టారెంట్ లో చట్టవిరుద్ధంగా పని చేస్తున్న ఏడుగురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మరో నలుగురిని విచారిస్తున్నారు. అలాగే  సౌత్‌ లండన్‌లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్‌హౌస్‌లో తనిఖీలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. భారతీయ రెస్టారెంట్లను టార్గెట్ చేయడం ప్రస్తుతం అక్కడ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్‌లో కూడా చర్చ జరిగింది. 

Also Read:  Paris AI Summit:  ప్రధాని మోదీ వెళ్ళిన పారిస్ సమ్మిట్ ఏంటి? ఇది భారత్ కు ఎందుకు ముఖ్యం?

Advertisment
తాజా కథనాలు