Guru Purnima 2025: గురు పూర్ణిమ ఈరోజే.. ఈ 4 వస్తువులు ఇంటికి తెస్తే మీ కష్టాలన్నీ మాయం!

 గురు పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదం. గురు పూర్ణిమ పవిత్ర రోజున ఇంటికి ఏ వస్తువులు తీసుకురావాలో తెలుసుకుందాం-

New Update
Guru Purnima 2025

Guru Purnima 2025

హిందూ మతంలో పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. మత విశ్వాసాల ప్రకారం, నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించిన  వేదవ్యాస మహర్షి జన్మదినాన్ని గురు పౌర్ణమిగా  జరుపుకుంటారు. వేదవ్యాసుడు మహాభారతం, 18 పురాణాలు, బ్రహ్మసూత్రాలను రచించాడు. అలాగే  వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, సామాన్యులకు కూడా జ్ఞానాన్ని అందించిన గురువుగా ఆయనను భావిస్తారు. అందుకే ఈ రోజును "వ్యాస పౌర్ణమి" అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఆయనకు మొదటి గురువు అనే బిరుదు కూడా ఇవ్వబడింది.  పూర్ణిమ రోజున విష్ణువు,  తల్లి లక్ష్మీ పూజకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది

ఈ ఏడాది  గురు పూర్ణిమ గురువారం, జూలై 10న అంటే ఈరోజే !  అయితే ఈ ప్రత్యేకమైన  రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదం. గురు పూర్ణిమ పవిత్ర రోజున ఇంటికి ఏ వస్తువులు తీసుకురావాలో తెలుసుకుందాం.

Also Read :  రష్యాకు బిగ్ షాక్.. 11 ఏళ్ల తర్వాత యూరప్ కోర్టు సంచలన తీర్పు!

శ్రీ యంత్రం

కుటుంబంలో ఆనందం,  అదృష్టాన్ని పెంచడానికి, గురు పూర్ణిమ నాడు శ్రీ యంత్రాన్ని ఇంటికి తీసుకురండి. శాస్త్రాల ప్రకారం, లక్ష్మీ దేవి శ్రీ యంత్రంలో నివసిస్తుంది. ఇంట్లో దీన్ని ఏర్పాటు చేయడం వల్ల సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే  ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. 

శంఖం 

విష్ణువుకు శంఖం అంటే చాలా ఇష్టం. గురు పూర్ణిమ నాడు శంఖం కొనడం చాలా శుభప్రదంగా చెబుతుతారు. ఈ ప్రత్యేకమైన  రోజున, పూజ సమయంలో ఒక శంఖాన్ని నీటితో నింపి విష్ణువుకు సమర్పించడం వలన భగవంతుడు సంతోషిస్తాడు.

Also Read :  కాంగ్రెస్కు బిగ్ షాక్..  శశిథరూర్ ఔట్ !

Also Read :  వైట్ శారీలో వయ్యారాలు ఒలికిస్తూ నభా అందాలు.. ఆహా ఏముంది!

కౌరీలు

గురు పూర్ణిమ సందర్భంగా, గవ్వలు ఇంటికి తీసుకువచ్చి లక్ష్మీ దేవికి సమర్పించండి. పూజ తర్వాత గవ్వలను  ఎర్రటి వస్త్రంలో కట్టి భద్రపరచండి. ఇది ఇంట్లో ఆనందం,  అదృష్టాన్ని పెంచుతుంది.

భగవద్గీత 

గురు పూర్ణిమ రోజున , పవిత్ర గ్రంథం 'భగవద్గీతను ' ఇంటికి తీసుకురావడం వల్ల శుభం కలుగుతుంది. అలాగే  ఈ పుస్తకాన్ని చదవడం వల్ల ఒక వ్యక్తి జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోయి అతని జీవితంలో సానుకూలత వస్తుంది.

Also Read: Allu Arjun-Atlee: ఇది మామూలు హైప్ కాదు.. పుష్పరాజ్ కి విలన్ గా ఆస్కార్ విజేత!

Latest News | Guru Pournami | Guru Purnima 2025

Advertisment
Advertisment
తాజా కథనాలు