Floods: భారీ వరదలు.. 90 మంది మృతి

ఫిలిప్పీన్స్‌లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటిదాకా 90 మంది ప్రాణాలు కోల్పోయారు.

New Update
Typhoon Kalmaegi Kills 90 in Philippines

Typhoon Kalmaegi Kills 90 in Philippines

ఫిలిప్పీన్స్‌లో వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటిదాకా 90 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. మరో 26 మంది గల్లంతయ్యారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా ఆకస్మిక వరదలు రావడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 

Also Read: షాకింగ్ వీడియో: నదిలో భక్తుల పడవ బోల్తా.. అరుపులు కేకలతో గందరగోళం

వరదల ధాటికి అనేక ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ తుపాను వల్ల ఫిలిప్పీన్స్‌లో సెబు ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమైంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే అనేక దేశాల్లో భారీగా వరదలు బీభత్సం సృష్టించాయి. వందలాది మంతి ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది నిరాశ్రయులయ్యారు. 

Also Read: నడి రోడ్డుపై దేశ అధ్యక్షురాలికి లైంగిక వేధింపులు.. వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు