Air Attack: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 367 డ్రోన్లు, మిస్సైల్స్

రష్యా శనివారం రాత్రి 367 డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఇందులో 13 మంది చనిపోయారు. 266డ్రోన్లు, 45 క్షిపణులను ఉక్రెయిన్ కూల్చివేసింది. కానీ కైవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీ లాంటి నగరాల్లో భారీగా ధ్వంసమయ్యాయి.

New Update
largest air attacks

రష్యా ఉక్రెయిన్‌పై భీకర దాడులకు దిగింది. పలు నగరాలపై 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. రాత్రిపూట జరిగిన ఈ దాడుల్లో 13 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. చాలావరకు రష్యా దాడులకు ఉక్రెయిన్ తిప్పికొట్టింది. 266 డ్రోన్లు, 45 క్షిపణులను ఉక్రెయిన్ కూల్చివేసింది. కానీ ఈ దాడుల్లో  కానీ కైవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీ లాంటి నగరాలు భారీగా నష్టపోయాయి. డజన్ల కొద్ది మంది గాయపడ్డారు. రెండు రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్‌పై రెండుసార్లు వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు.

Also Read :  పాకిస్తాన్‌పై ప్రతీకారం.. మన్ కీ బాత్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు

Russia Launches Air Attack On Ukraine

Also Read :  కవిత ఇష్యూపై హరీష్ రావు షాకింగ్ రియాక్షన్ !

ఇది ఇప్పటివరకు యుద్ధంలో అతిపెద్ద వైమానిక దాడిగా గుర్తించబడింది. ఈ దాడిలో జైటోమిర్‌లో ముగ్గురు పిల్లలు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కైవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీలపై దాడులు జరిగాయి. ఉక్రెయిన్ వైమానిక దళం 266 డ్రోన్లు, 45 క్షిపణులను కూల్చివేసింది. అయినప్పటికీ అపార్ట్‌మెంట్ బ్లాక్‌లు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కైవ్‌లో 11 మంది గాయపడగా, ఖ్మెల్నిట్స్కీ నలుగురు మరణించినట్లు నివేదించారు. శుక్రవారం నాడు డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో కైవ్‌ను టార్గెట్ చేసి మొదటిసారి అటాక్ జరిగింది. తర్వాత ఇది రెండో వైమానిక దాడి.

Also Read :  విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

ukraine | Russia Attacked Ukraine with Ballistic Missile | russia declares war on ukraine | russian ukraine war | russia-ukraine | russia ukraine conflict | latest-telugu-news

Also Read :  రెండు ముక్కలుగా GHMC.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు