IND-PAK WAR : ఆకలితో ఉన్న కుక్కకు పట్టెడన్నం పెడితే అది జీవితాంతం విశ్వాసాన్ని కలిగిఉంటుంది, కానీ టర్కీ కుక్కకంటే హీనంగా ప్రవర్తిస్తోంది. 2023లో ఆ దేశంలో భారీ భూకంపం సంభవించినపుడు ఆ దేశం పట్ల స్పందించిన తొలిదేశం భారత్. ‘ఆపరేషన్ దోస్త్’ ఆ దేశానికి భారీగా మానవతా సాయాన్ని అందించింది. ప్రత్యేకంగా కిషాన్ డ్రోన్లతో బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేసింది. అప్పుడు మనం మానవత్వాన్ని చూపితే దాన్ని మరిచి ఇప్పుడు భారత్‌పై దాడికి పాకిస్థాన్‌కు డ్రోన్లను పంపించింది టర్కీ.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!
భారత్ ఉగ్రస్థావరాలపై దాడి చేయగానే పాకిస్థాన్ గురువారం దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించింది. వాటన్నింటిని భారత్ కూల్చివేసింది. ఆ శకలాలను ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షించారు. అవన్నీ టర్కీకి చెందిన ‘అసిస్ గార్డ్ సోనగర్’ డ్రోన్లుగా ధ్రువీకరించారు. పహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్థాన్‌పై భారత్ దాడి చేస్తుందని టర్కీ ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారత్‌కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో ఆరు సైనిక విమానాల్లో పాక్‌కు ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపింది. ఇప్పుడు ఆ ఆయుధాలనే భారత్‌పై పాకిస్థాన్ ప్రయోగిస్తోంది. పహల్గాం దాడి తర్వాత ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు మద్ధతుగా నిలిస్తే ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్ బైజాన్ మాత్రమే పాక్‌కు మద్దతిస్తూ ప్రకటనలిచ్చాయి.
Also Read: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై వరల్డ్ బ్యాంక్ కీలక ప్రకటన!
తాజాగా అంతర్జాతీయంగా పాక్ చర్యకు వ్యతిరేకత రావడంతో టర్కీ డబుల్ గేమ్ మొదలు పెట్టింది.తాజాగా, పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన మృతులకు టర్కీ సంతాపం ప్రకటించింది. దీంతో టర్కీ అధినేత డబుల్ గేమ్ పై భారత్ ఇంకా స్పందించలేదు.
Also Read: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు
ఇది కూడా చూడండి: BIG BREAKING: మళ్లీ మొదలైన యుద్ధం.. పాకిస్థాన్ కాల్పులు