/rtv/media/media_files/2026/01/25/rodriguez-2026-01-25-09-49-49.jpg)
వెనెజువెలాపై అమెరికా చేసిన దాడి గురించి ఇంకా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇందులో మాజీ అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను అరెస్ట్ చేస్తున్నప్పుడు తమకు ఎదురైన సవాళ్ళ గురించి తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ ఫోన్లో మాట్లాడిన వీడియో ఒకటి తాజాగా లీక్ అయింది. ఆ టైమ్ లో అమెరికా అక్కడున్న వారికి కేవలం 15 నిమిషాలే సమయం ఇచ్చిందని తెలుస్తోంది. తమ డిమాండ్లు అంగీకరిస్తారా.. లేక చస్తారా అని అమెరికా దళాలు బెదిరించినట్లు అందులో ఉంది. మదురోను అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన ఓ సమావేశంలో ప్రస్తుత అధ్యక్షురాలు రోడ్రిగ్జ్ ఫోన్ కాల్ విషయాలు ఇవన్నీ. ఇందులో ఆమె అధికారాన్ని కాపాడుకోవడమే తన ప్రాధాన్యత అని చెప్పినట్లుగా ఉంది.
15 నిమిషాలు మాత్రమే సమయం..
మదురోను నిర్భంధించిన దగ్గర నుంచీ తమకు బెదిరింపులు మొదలయ్యాయి. అమెరికా డిమాండ్లపై స్పందించేందుకు నాకు, నాకు, అంతర్గత మంత్రి డియోస్టాడో కాబెల్లో, నా సోదరుడు, మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్‌లకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చారని రోడ్రిగ్జ్ చెప్పారు. మదురో, ఆమె భార్యను అరెస్ట్ చేయలేదని, చంపేశామని యూఎస్ సైన్యం తమకు చెప్పింది. ఇలాంటి టైమ్ లో బాధ్యతలు స్వీకరించాల్సి రావడం బాధాకరం అంటూ ఆమె మాట్లాడారు.
సూపర్ సోనిక్ ఆయుధం..
ఈ ఆపరేషన్ కోసం ట్రంప్ ప్రభుత్వం ఓ సీక్రెట్ ఆయుధాన్ని ప్రయోగించినట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా సైన్యం వెనెజువెలాపై దాడి చేసినప్పుడు అక్కడి సెక్యూరిటీ గార్డు చెప్పిన విషయాలు సంచలనం రేపుతున్నాయి. వైట్‌హౌస్ సెక్రటరీ దీన్ని తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేయడం ఇతర దేశాలకు షాకిస్తున్నాయి. వెనెజువెలా సెక్యురిటీ గార్డు తెలిపిన వివరాల ప్రకారం.. మదురోను అరెస్ట్ చేసే ముందు 8 హెలికాప్టర్ల నుంచి కొంత మంది సైనికులు దిగారు. సుమారు వాళ్లు 20 మంది ఉండొచ్చు. సాంకేతికపరంగా వాళ్ల వద్ద అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. మేము ఇంతకుముందు వాళ్లను ఎప్పుడు చూడలేదు. మేము వందల మంది ఉన్నప్పటికీ ఏం చేయలేకపోయాం. వాళ్లు వేగంగా కాల్పులు చేశారు. ఒక్కో సైనికుడు నిమిషానికి 300 రౌండ్లు ఫైరింగ్ చేసినట్లు అనిపించింది. ఏదో విచిత్రమైన ఆయుధాన్ని వాళ్లు వాడారు. భారీ శబ్దం వచ్చింది. తల పేలిపోతున్నట్లు అనిపించింది. ముక్కు నుంచి రక్తం వచ్చింది. కొందరు రక్తం కక్కుకున్నారు. అందరం కింద పడిపోయి కదలలేకపోయామని'' వెనెజువెలా సెక్యూరిటీ గార్డు వివరించారు. అమెరికా సూపర్ సోనిక్ ఆయుధాన్ని వాడి ఉంటుందని ప్రపంచదేశాలు అనుమానిస్తున్నాయి. టార్గెట్‌ను ధ్వంసం చేసేందుకు మైక్రోవేవ్స్ లేదా లేజర్స్‌ను వాడినట్లు తెలుస్తోందని అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ సభ్యుడు ఒకరు చెప్పారు.
Also Read: Snow Storm: అమెరికాను కప్పేసిన మంచు తుఫాను..8 వేల విమానలు రద్దు
Follow Us