/rtv/media/media_files/2025/01/22/2XlFiNptesgl4xZuND0K.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన మరో కీలక ప్రకటన చేశారు. ట్యాక్స్ వసూళ్లు చేసే 'ఇంటర్నెల్ రెవెన్యూ సర్వీస్'లో కొత్తగా చేరిన 90 వేల మంది ఏజెంట్లను సరిహద్దులకు పంపించనున్నట్లు పేర్కొన్నారు. లేదా తొలగిస్తామన్నారు. వాళ్లకు తుపాకులు ఇచ్చి సరిహద్దుకు పంపించడమే సరైందని తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన కొన్ని గంటల్లోనే ఫెడరల్ ఉద్యోగుల నియాకాలు 90 రోజులు స్తంభింపజేశారు. దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు.
Also Read: మా స్కీమ్స్‌తో ప్రతి ఇంటికి నెలకు రూ.25 వేల ప్రయోజనం: కేజ్రీవాల్
ఇందులో జాతీయ భద్రత, ప్రజారక్షణ విభాగాలకు మినహాయింపు ఇచ్చారు. అయితే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ విభాగంలో మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆపేయాల్సి ఉంటుంది. ఇదిలాఉండగా ట్రంప్ మరో కొత్త ఎక్స్‌టర్నల్ రెవెన్యూ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ విభాగం విదేశాల నుంచి పన్నులు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయాలను వసూలు చేస్తుంది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం.. కెనడా, మెక్సికోలపై భారీగా పన్ను విధించనున్న సంగతి తెలిసిందే.
Also Read: తేనెకళ్ల సుందరి మోనాలిసా ఇల్లు చూశారా ? వీడియో వైరల్
ఇదిలాఉండగా.. ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్ ప్రొగ్రామ్స్‌ను నిర్వీర్యం చేస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాలపై సంతకం చేశారు. ఈ క్రమంలోనే సిబ్బంది నిర్వహణ కార్యాలయం మెమోను రిలీజ్ చేసింది. దీని ప్రకారం చూసుకుంటే డెవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ (DEI) సిబ్బంది మొత్తాన్ని అమెరికా కాలమన ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా శాలరీతో కూడా సెలవులపై పంపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేకాదు ఈ డిపార్ట్‌మెంట్స్‌కు చెందిన అన్ని వెబ్ పేజీలను కూడా ఈ గడవులోగా తొలగించాలని స్పష్టం చేశారు.
Also Read: షారుఖాన్‌కు మహారాష్ట్ర గవర్నమెంట్ రూ.9 కోట్లు రీఫండ్