Zelenskyy: 500 బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ వద్దొన్న జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌లో భూగర్భ ఖనిజాలను బయటకి తీసేందుకు ట్రంప్‌ 500 బిలియన్‌ డాలర్ల డీల్‌ను ఆ దేశానికి ప్రతిపాదించినట్లు బ్రిటన్‌ చెందిన ఓ వార్తాసంస్థ తెలిపింది. కానీ జెలెన్‌స్కీ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు పేర్కొంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Zelenskyy

Zelenskyy


Zelenskyy: గత మూడేళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం(Russia Ukraine War) ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు కుదుర్చేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(US President Trump) ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా(Saudi Arabia)లో శాంతి చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమెరికా, ఉక్రెయిన్‌(America, Ukraine)కు సంబంధించి తాజాగా ఓ సంచలన విషయం బయటపడింది. ఉక్రెయిన్‌లో అరుదైన భూగర్భ ఖనిజాలను బయటకి తీసేందుకు డొనాల్డ్ ట్రంప్‌ 500 బిలియన్‌ డాలర్ల డీల్‌ను ఆ దేశానికి ప్రతిపాదించినట్లు బ్రిటన్‌ చెందిన ఓ వార్తాసంస్థ తెలిపింది. ఇది జరిగితే అమెరికాకు 50 శాతం లాభం రానున్నట్లు చెప్పింది. 

Also Read: ఇన్ఫోసిస్‌పై కాగ్నిజెంట్‌ సంచలన ఆరోపణలు

కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం ఈ డీల్‌ను తిరస్కరించినట్లు పేర్కొంది. '' ఉక్రెయిన్‌లో అరుదైన భూగర్భ ఖనిజాలు, గ్యాస్, చమురు, పోర్టులు, మౌలిక సదుపాయాలతో పాటు ఆ దేశంలో ఉన్న సగభాగం సహజ వనరులపై తమకు ఆధిపత్యం ఇవ్వాలని అమెరికా కోరింది. కానీ అమెరికా.. ఉక్రెయిన్ నుంచి కావాలనుకున్న ఈ మొత్తం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీలపై విధించిన ఆంక్షల కంటే ఎక్కువే. ఒకవేళ ఈ డీల్ కుదిరితే ఉక్రెయిన్‌లో భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల రూల్స్‌ను నిర్ణయించడంలో అమెరికన్ ఫండ్‌కు నియంత్రణ దక్కే ఛాన్స్ ఉంటుంది. ఈ డీల్‌లో అమెరికాకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అందుకే ఈ డీల్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తిరస్కరించారని'' బ్రిటన్ వార్తాసంస్థ వివరించింది.  

Also Read: కుంభమేళాకు సాహసయాత్ర.. గంగానదిలో 550km పడవ ప్రయాణం వీడియో వైరల్

ట్రంప్‌ మాట్లాడుతూ..

ఇదిలాఉండగా ఈ ఒప్పందం గురించి ట్రంప్‌ మాట్లాడుతూ.. తాను ఉక్రెయిన్‌కు 500 బిలియన్ డాలర్ల డీల్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. దీనికి జెలెన్‌స్కీ కూడా అంగీకరించారని చెప్పారు. తమకు ఖనిజాలు దొరికితే.. ఆ దేశానికి అవసరమైన వాటిని ఇస్తామని తెలిపారు. మరోవైపు జెలెన్‌స్కీ కూడా దీనిపై మాట్లాడారు. ఇరుదేశాలు అమెరికాకు చెందిన సంస్థలకు ఉపయోగపడే పునర్నిర్మాణ ఒప్పందాలు చేసుకుంటున్నట్లు చెప్పారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు ఎక్కువగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభం చేకూరుతాయని అన్నారు. దీనివల్ల ఉక్రెయిన్‌లో కూడా ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపారు. అయితే చివరికి జెలెన్‌స్కీ ఈ డీల్‌ను తిరస్కరించినట్లు వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: విశాఖలో లారీ భీభత్సము.. పార్కులోకి దూసుకెళ్లడంతో..

Advertisment
తాజా కథనాలు