/rtv/media/media_files/2025/02/18/axeo3vpj6n94Dr2qhNSA.jpg)
Infosys and Cognizant
Infosys vs Cognizant: ఐటీ(IT) దిగ్గజాలపై ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీల మధ్య వివాదం కొనసాగుతోంది. అమెరికా కోర్టు(America Court)లో వేసిన ఓ దావాపై ఈ సంస్థలు గత కొంతకాలంగా పోరాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే కాగ్నిజెంట్.. ఇన్ఫోసిస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్(Health Care Software) అయిన ట్రైజెట్టో నుంచి వాణిజ్య సీక్రెట్ సమాచారాన్ని ఇన్ఫోసిస్ దొంగిలించిందని విమర్శలు చేసింది. నాన్ డిస్‌క్లోజర్ అండ్ యాక్సె్స్ అగ్రిమెంట్ (NDAA) ద్వారా ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలు దుర్వినియోగం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిందని ఆరోపణలు చేసింది.
Also Read: అశ్లీల కంటెంట్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
కాగ్నిజెంట్ సంచలన ఆరోపణలు..
దీనిపై ఆడిడ్ చేసేందుకు కూడా ఇన్ఫోసిస్ నిరాకరించిందని కాగ్నిజెంట్ పేర్కొంది. తమ వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించనట్లు 2024 ఆగస్టులో అమెరికా కోర్టులో కాగ్నిజెంట్ దావా వేసింది. మరోవైపు ఈ ఆరోపణలను ఇన్ఫోసిస్ తిరస్కరించింది. కాగ్నిజెంట్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ బహిరంగానే ఉన్నాయని పేర్కొంది. అంతేకాదు గతంలో తమవద్ద పనిచేసిన రవికుమార్ ఇప్పుడు కాగ్నిజెంట్‌లో ఉన్నాడని.. మా వద్ద పనిచేసిన సమయంలో హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ విడుదల చేయడాన్ని ఆయన ఆలస్యం చేశారంటూ ఆరోపించింది. కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం రవికుమార్ చర్చలు జరిపినట్లు పేర్కొంది.
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
ఇదిలాఉండగా రవికుమార్ గతంలో ఇన్ఫోసిస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2022 అక్టోబర్‌లో ఆ సంస్థను విడిచిపెట్టారు. ఆ తర్వాత 2023 జనవరిలో కాగ్నిజెంట్ కంపెనీలో సీఈవోగా చేరారు. అయితే ఈ రెండు ఐటీ కంపెనీలు కూడా ఆరోగ్య సంరక్షణ సేవా రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్‌కు వచ్చే ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సె్స్ విభాగం నుంచే వస్తోంది.
Also Read: దక్షిణ అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 31 మంది మృతి
Also Read: మలైకా అరోరాకి ఇష్టమైన జ్యూస్ ఇదే.. అది ఎలా తయారు చేయాలో తెలుసా..