/rtv/media/media_files/2025/02/17/7N3vVIQKqbdHrpaJ7Gf6.jpg)
Energy Drinks
Energy Drinks: ప్రస్తుత బిజీ జీవనశైలిలో ఆరోగ్యం పట్ల తక్కువ శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆహారపు అలవాట్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వలన అనేక రకాల ఆనారోగ్య సమస్యలతో వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ శక్తి క్షీణిస్తోందని కొందరు చెబుతూ ఉంటారు. రోజూ ఎంత తిన్న సాయంత్రానికి తక్కువ శక్తితో బాధపడుతుంటే..ఆహారపు అలవాట్లలో ఏదో పొరపాటు చేస్తున్నారని అర్థం.అటువంటి సమయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోజూ కొన్ని పానీయాలను తీసుకుంటే తాగిన వెంటనే శక్తివంతం అవుతాయి. ఈ పానీయాలు ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆ పానీయాలు ఏంటో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తక్షణ శక్తి కోసం:
కొబ్బరి నీరు పొటాషియం, కాల్షియం, మాంగనీస్, యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలకు మంచి వనరు. ఈ పోషకాలన్నీ శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడతాయి. ఇవి డీహైడ్రేషన్ నుంచి కూడా రక్షిస్తుంది. ఆమ్లా, బీట్‌రూట్, క్యారెట్ స్మూతీలను తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. క్యారెట్లలో ఉండే విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లు శరీర అవసరాలను తీరుస్తాయి. బీట్‌రూట్ సహజ రసాయన నైట్రేట్‌కు మంచి మూలం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనివల్ల తక్కువ రక్తపోటు వంటి పరిస్థితి తలెత్తదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: చిలగడదుంపతో చక్కటి చర్మ సౌందర్యం.. ఈ 5 ప్రయోజనాలు..!!
ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. డ్రై ఫ్రూట్ షేక్‌లో ఉండే కార్బోహైడ్రేట్లు, సహజ చక్కెర శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. ఇది మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. దీనితో పాటు గింజలలో ఉండే విటమిన్ బి కండరాలకు శక్తిని అందించడానికి పనిచేస్తుంది. మిశ్రమ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ అద్భుతమైన మూలం. శరీరాన్ని శక్తివంతంగా ఉంచడమే కాకుండా.. చర్మ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: చర్మం, జుట్టుకు బాదం నూనె బెస్ట్.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి