US - Iran Israel War: ఇరాన్ పై దాడులు.. రెండు వారాల్లో నిర్ణయిస్తారు..వైట్ హౌస్

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాల్గొంటుందని...ఇరాన్ పై సైనిక చర్యలు తీసుకుంటుందని వార్తలు వచ్చాయి. దీనిపై వైట్ హౌస్ స్పందించింది. అమెరికా అధ్యక్షుడు రెండు వారాల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పింది. 

New Update
us

US - Iran Israel War

US - Iran Israel War: మిడిల్ ఈస్ట్ ఇప్పటికే భగ్గుమంటోంది.  ఇరాన్(iran-attack), ఇజ్రాయెల్ భీకర దాడులు చేసుకుంటున్నాయి. వీరికి తోడు అగ్రరాజ్యం అమెరికా(usa) కూడా తుడవనుందని వార్తలు వస్తున్నాయి. అమెరికాతో అణు ఒప్పందానికి ఇరాన్ ఒప్పుకోలేదు. కానీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం వారి దగ్గర అణ్వాయుధాలు ఉండడానికి వీలు లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మీద తాము కూడా దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరిస్తూనే ఉన్నారు. దీనిపై అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్‌ నుంచి కీలక ప్రకటన వెలువడింది.

Also Read: డీఎంకే కుటుంబంలో కలహాలు..ఆస్తి కోసం సోదరుల తగువులు

సైనిక చర్య తప్పదు..

ఇరాన్ పై దాడులు చేసేందుకు అమెరికా సిద్ధమౌతోంది. ఆ దేశంపై దాడులు తప్పవని చెబుతూనే ఉంది. అయితే రాన్ పై సైనిక చర్య చేట్టే విషయమై అధ్యక్షడు ట్రంప్ రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని ఈ రోజ వైట్ హౌస్ కీకల ప్రకటన చేసింది. ఇరాన్‌తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేవా అనే అంశాన్ని బట్టి అధ్యక్షుడు ట్రంప్‌ రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ మీడియాకు తెలిపారు. ఇరాన్ తో దౌత్య పరమైన పరిష్కారానికే అధ్యక్షుడు సిద్ధంగా ఉన్నారని...కానీ అందుకు ఆ దేశం సుముఖంగా లేదని చెప్పింది. టెహ్రాన్ కు అణ్వాయుధాలను అభివృద్ధి చేసే సామర్థ్యం తగ్గించడమే అమెరిక ఉద్దేశమని తెలిపింది. వచ్చే వారం చాలా కీలకమైనది..పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వైట్ హౌస్ చెప్పింది. 

Also Read: నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్లు, టాంపూన్లు, కప్‌లు.. ఏవి మంచివి?

మరోవైపు ఇజ్రాయెల్ లోని ఆసుపత్రిపై ఇరాన్ దాడులు చేసింది. దీనిపై ఆ దేశ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. ఇరాన్ కు తీవ్ర హెచ్చరకలు జారీ చేశారు. టెహ్రాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తాము అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుంటే.. వాళ్లు మాత్రం అమాయకులే లక్ష్యంగా ఆసుపత్రులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ కొత్త చీఫ్‌
Advertisment
Advertisment
తాజా కథనాలు