Trump Warning: కాల్పుల విరమణ ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు..ట్రంప్ వార్నింగ్

కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.  మరో రెండు రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అలస్కాలో కలవనున్నారు ట్రంప్. ఇవి సుంకాల నుంచి విపరీత ఆంక్షల వరకు ఏవైనా ఉండవచ్చని చెప్పారు. 

New Update
Trump

Trump

శుక్రవారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో జరిగే సమావేశంపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ అంగీకరించాల్సిందే అన్నారు. అలా చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. బుధవారం యూరోపియన్ నాయకులతో జరిగిన వర్చువల్ సమావేశంలో కూడా ట్రంప్ ఈ విషయాన్ని స్పష్టం చేశారని తెలుస్తోంది. రష్యా శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే సుంకాల విధింపు నుంచి తీవ్ర ఆంక్షల వరకు దైనినైనా విధించవచ్చని అన్నారు.  అలాస్కాలో జరగనున్న యుఎస్-రష్యా శిఖరాగ్ర సమావేశంలో అమెరికా కాల్పుల విరమణ సాధించాలని కోరుకుంటుందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. అలాగే పుతిన్ తో చర్చల తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి త్రైపాక్షిక సమావేశం నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు.  రష్యా, అమెరికా అధ్యక్షుల భేటీ చాలా ముఖ్యమైనదని...యూరోపియన్ సమాఖ్య కూడా యుద్ధం ముగింపును కోరుకుంటోందని మాక్రాన్ వ్యాఖ్యానించారు. అలాగే త్రైపాక్షిక సమావేశం కూడా చాలా ముఖ్యమని..దానిని తటస్థ దేశంలో నిర్వహించాలని ఆయన కోరారు. అలాగే శాంతి ఒప్పందం దిశగా అడుగులు వేయకపోతే ఐరోపా, అమెరికాలు కలిసి రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుందని జర్మనీ ఛాన్సరల్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ అన్నారు. 

పుతిన్ బుకాయిస్తున్నారు..

మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో మాట్లాడారు. బెర్లిన్ వేదికగా ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో చర్చలు జరిపారు. పుతిన్ బుకాయిస్తున్నారని ఆరోపించారు. మొత్తం ఉక్రెయిన్ ను ఆక్రమించే సామర్ధ్యం ఉందంటూ యుద్ధాన్ని విస్తరించేందుకు చూస్తున్నారని అన్నారు. ఒకవేళ కల్పుల విరమణకు పుతిన్ అంగీకరించకపోతే...మరిన్ని ఆంక్షలు విధించాలని జెలెన్ స్కీ ట్రంప్ ను కోరినట్లు తెలుస్తోంది. ఆంక్షల ప్రభావం తమపై ఉండదని రష్యా నటిస్తోంది కానీ...అవి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ను తీవ్రంగా దెబ్బ తీస్తాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడితో పాటూ ప్రపంచ దేశాల నేతలు యుద్ధ విరమణకు ఏకతాటిపై నిలిచాయని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. 

నాటోకు ఆయుధాలు అందజేస్తాం..

అంతకు ముందు కూడా జూలైలో రష్యుయాపై ఇదే విధంగా విరుచుకుపడ్డారు ట్రంప్. 50 రోజుల్లో కాల్పులు విరమణ ప్రకటించాలని హెచ్చరించారు. లేకపోతే పెద్ద ఎత్తున సుంకాలతో శిక్షిస్తానని చెప్పారు.  తాను ఈ మధ్య చాలాసార్లు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించానని..బాగా పని చేస్తుందని చెప్పుకొచ్చారు. అయితే రష్యా పై ఎలాంటి సుంకాలు విధిస్తారు అనే దానిపై మాత్రం ట్రంప్ క్లారిటీ ఇవ్వలేదు. శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే ఉక్రెయిన్ కు సహాయంగా ఉంటామని మళ్ళీ హామీ ఇచ్చారు. అత్యాధునిక ఆయుధాలను నాటోకుే అందజేస్తామని.. అది ఉక్రెయిన్ తో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. నాటోకు పంపే ఆయుధాలలో పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు, బ్యాటరీలు ఉంటాయని కూడా తెలిపారు. 

Also Read: Sachin Son: సైలెంట్ గా సచిన్ టెండూల్కర్ కొడుకు నిశ్చితార్థం..ముంబైకు చెందిన వ్యాపార వేత్త మనువరాలితో..

Advertisment
తాజా కథనాలు