Trump: బీబీసీకి ట్రంప్‌ బిగ్‌ షాక్.. 5 బిలియన్‌ డాలర్ల దావా వేస్తానని హెచ్చరిక

2021లో అమెరికాలో క్యాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడి అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో తన ప్రసంగాన్ని మార్చినందుకు బీబీసీపై 5 బిలియన్ల డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు.

New Update
Trump to sue BBC for $5 billion, US President issues new threat despite British broadcaster's apology

Trump to sue BBC for $5 billion, US President issues new threat despite British broadcaster's apology

2021లో అమెరికాలో క్యాపిటల్‌ హిల్‌పై జరిగిన దాడి అప్పట్లో సంచలనం రేపింది. ఆ సమయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుడు అర్థం వచ్చేలా మార్చడంతో బీబీసీకి చిక్కులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగాన్ని మార్చినందుకు బీబీసీపై 5 బిలియన్ల డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు. ఇప్పటికే ట్రంప్‌కు చెందిన న్యాయబృందం.. ఆయన పరువుకు భంగం కలిగించినందుకు పరిహారంగా బిలియన్ డాలర్లు చెల్లించాలని బీబీసీకి లేఖ రాసింది. 

Also Read: నితీశ్‌తో ముగిసిన భేటి.. చిరాగ్ పాశ్వన్ సంచలన వ్యాఖ్యలు

దీనికి బీబీసీ క్షమాపణలు చెప్పినప్పటికీ ట్రంప్ డిమాండ్ చేసిన బిలియన్‌ డాలర్ల పరిహారాన్ని చెల్లించేందుకు నిరాకరించింది. ఈ క్రమంలోనే ఆ సంస్థపై దావా వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. వచ్చే వారంలో బీబీసీపై 1 బిలియన్ డాలర్ల నుంచి 5 బిలియన్‌ డాలర్ల వరకు కోర్టులో దావా వేస్తానని తేల్చిచెప్పారు. అంతేకాదు దీనిగురించి బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో కూడా చర్చిస్తానని పేర్కొన్నారు. 

Also Read: విమాన ప్రమాదంలో భారతీయురాలు మృతి.. రూ.317 కోట్ల పరిహారం

2020 ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో 2021 జనవరి 6న వాషింగ్టన్‌లో క్యాపిటల్ హిల్‌పై ఆయన మద్దతుదారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌ సుమారు గంట పాటు ప్రసంగించారు. ఆయన మాటలను బీబీసీ.. తమ డాక్యుమెటరీలో తప్పుగా ఎడిట్ చేసి ప్రచారం చేసినట్లు విమర్శలు వచ్చాయి. ట్రంప్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు.  దీంతో బీబీసీ డైరెక్టర్ టిమ్‌ డేవీ, న్యూస్‌ చీఫ్‌ టర్నెస్‌ డెబోరా రాజీనామా చేశారు. ఆ సంస్థ కూడా దీనిపై క్షమాపణలు చెప్పినా కూడా బిలియన్ డాలర్ల పరిహారం ఇవ్వాలని ట్రంప్ లేఖ రాశారు. కానీ బీబీసీ ఇందుకు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ ఆ సంస్థపై 5 బిలియన్‌ డాలర్ల దావా వేస్తానని హెచ్చరించారు. 

Advertisment
తాజా కథనాలు