Trump: ఇండియాపై మరో బాంబు పేల్చబోతున్న ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై బాంబు పేల్చబోతున్నారు. రష్యాను లొంగదీసుకునేందుకు పరోక్షంగా ఇండియాపై మరిన్ని టారిఫ్స్‌ విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్స్‌ విధించిన సంగతి తెలిసిందే.

New Update
Trump

Trump

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై బాంబు పేల్చబోతున్నారు. రష్యాను లొంగదీసుకునేందుకు పరోక్షంగా ఇండియాపై మరిన్ని టారిఫ్స్‌ విధించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్స్‌ విధించిన సంగతి తెలిసిందే. త్వరలో సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులపై కూడా టారిఫ్స్ వేస్తారనే ప్రచారం నడుస్తోంది. రష్యా నుంచి భారత్ ఆయిల్‌ కొనుగోలు చేస్తూ యుద్ధానికి సహకరిస్తోందని ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. 

Also Read: ఇజ్రాయెల్‌పై విరుచుకుప్డడ హౌతీలు.. ఎయిర్‌పోర్టుపై దాడులు

 ఇటీవల ఉక్రెయిన్‌పై రష్యా దాడులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రష్యాపై మరిన్ని ఆంక్షలకు సిద్ధమని తాజాగా ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్‌ కూడా రష్యాపై ఆంక్షలు విధించింది. చైనా, భారత్‌ వీటిని పట్టించుకోకుండా  రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. 

Also Read: ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఐటీ..కాపాడుకుంటామన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

Advertisment
తాజా కథనాలు