Trump: ఇరాన్‌లో ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు.. సపోర్ట్ చేస్తున్న ట్రంప్

ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆందోళనలు అణిచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

New Update
Trump threatens Iran with ‘hell’ if it kills protesters, declines to meet the Shah’s son

Trump threatens Iran with ‘hell’ if it kills protesters, declines to meet the Shah’s son

ఇరాన్‌లో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అక్కడి సుప్రీం లీడర్ అయాతొల్లా ఖమేనీ వెంటనే పదవి నుంచి దిగిపోవాలంటూ ప్రజలు పెద్దఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Donald Trump) ఇరాన్‌ ప్రభుత్వాన్ని(Iran Government) హెచ్చరించారు. ఆందోళనలు అణిచివేయాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యా్ఖ్యలు చేశారు.'' ఇరాన్‌లో నిరసనలు చెలరేగినప్పుడు అక్కడి దేశాధినేతలు వీటిని అణిచివేయాలనుకుంటారు. ఇది సహజం. కానీ ఈసారి కూడా అలా చేస్తే మేము జోక్యం చేసుకుంటాం. వాళ్లని తీవ్రంగా దెబ్బతీస్తామని'' అన్నారు. 

Also Read: కువైట్‌లో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష విధించిన కోర్టు.. ఎందుకంటే ?

Trump Threatens Iran With Hell

గత కొన్నిరోజులుగా జరుగుతున్న నిరసనల్లో ఇప్పటిదాకా 45 మంది మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ట్రంప్ స్పందించారు. నిరసనలు జరిగేటప్పుడు తొక్కిసలాట వల్ల ఇది జరిగిందని దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేమని అన్నారు. అలాగే ఇరాన్ నిరసనకారులను చాలా ధైర్యవంతులంటూ కొనియాడారు. ఇదిలాఉండగా ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం వల్ల అక్కడి ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 

Also Read: వెనిజులా చమురు నిల్వలు అమెరికా చేతికి.. ట్రంప్ కీలక ప్రకటన

మరోవైపు ప్రవాసంలో తలదాచుకున్న యువరాజు రెజా పహ్లావి కూడా నిరసనలు పిలుపునిచ్చారు. దీంతో ఈ ఆందోళనలు ఇరాన్‌ అంతటా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌, టెలిఫోన్ సేవలను నిలిపివేసింది. అక్కడ జరుగుతున్న నిరసనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు