/rtv/media/media_files/2025/10/08/nobel-2025-10-08-15-49-17.jpg)
Chemistry Nobel Prize awarded to trio in field of metal–organic frameworks
రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి వరించింది. మెటల్ అర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్‌ను అభివృద్ధి చేసినందుకు గాను కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీలకు ఈ పురస్కారం అందించనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొది. ఈ ముగ్గురు కొత్తరకం మాలిక్యూలర్ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది. గతేడాది కూడా ఈ విభాగంలో ముగ్గురికి నొబైల్ ప్రైజ్ దక్కింది. ప్రొటీన్లపై విశేష పరిశోధనలు చేసినందుకు గాను డెమిస్ హసాబిస్, జాన్ జంపర్, డేవిడ్ బేకర్‌కు ఈ బహుమతి లభించింది.
JUST IN | The #NobelPrize in Chemistry is being awarded to Susumu Kitagawa, Richard Robson and Omar M. Yaghi “for the development of metal–organic frameworks.,” the Royal Swedish Academy of Sciences announced on Wednesday (October 8, 2025). pic.twitter.com/OxBudl3WQ9
— The Hindu (@the_hindu) October 8, 2025
1901 నుంచి 2024 మధ్యకాలంలో 116 సార్లు రసాయన శాస్త్రంలో నోబెల్ అవార్డులు ప్రకటించారు. ఈ విభాగంలో ఇప్పటిదాకా 195 మంది ఈ బహుమతులు అందుకున్నారు. వీళ్లందరిలో 97 ఏళ్ల వయసులో జాన్ బీ గూడ్‌ఎనఫ్ అనే వ్యక్తి రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న వృద్ధుడిగా నిలిచారు. ఇక 35 ఏళ్ల వయసులోనే నోబెల్ అందుకున్న అతి పిన్న వయస్కుడిగా ఫ్రెడెరిక్ జొలియట్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఫ్రెడరిక్ సాంగెర్, బ్యారీ షార్ప్‌లెస్‌లు కెమిస్ట్రీ విభాగంలో రెండుసార్లు నోబెల్ అందుకున్నారు.
Also Read: ఇదేం దిక్కుమాలిన కంపెనీరా.. దీపావళి పార్టీకి ఒక్కో ఉద్యోగి నుంచి రూ.12 వందలు వసూలు!
ఇదిలాఉండగా అక్టోబర్ 6న నోబెల్ పురస్కారాలు ప్రకటన మొదలైన సంగతి తెలిసిందే. అక్టోబర్ 13 వరకు ఇది కొనసాగనుంది. ముందుగా వైద్యశాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న వాళ్ల పేర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బుధవారం రసాయన శాస్త్రమంలో ఈ అవార్డు గెలుచుకున్న వారి పేర్లు ప్రకటించారు. ఇక గురువారం సాహిత్యం, శుక్రవారం శాంతి బహుమతి, చివరగా అక్టోబర్ 13న అర్థశాస్త్రంలో ఈ పురస్కారం అందుకోబోయే వాళ్ల ప్రకటించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 10న ఆల్‌ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ఈ అవార్డును విజేతలకు అందిస్తారు.
Also Read: ఉక్రెయిన్ దళాల చేతిలో..రష్యా సైన్యంలోని భారతీయుడు..నిర్థారిస్తామన్న విదేశాంగ శాఖ