/rtv/media/media_files/2025/11/21/trump-tariffs-2025-11-21-18-54-44.jpg)
Trump tariffs to reduce US deficits by $1 trillion less than previous estimate, CBO says
ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాలపై భారీగా టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. తాను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అమెరికాకు భారీగా లాభం చేకూరిందని ట్రంప్ కూడా గొప్పలు చెప్పుకున్నారు. కానీ అవన్నీ ఒట్టి మాటలే అని తేలిపోయింది. విదేశాల నుంచి దిగుమతి అయిన వస్తువులపై ట్రంప్ టారిఫ్‌లు ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదని కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (CBO) వెల్లడించింది. ఈ టారిఫ్‌ల వల్ల అమెరికాలో వాణిజ్య లోటు 4 ట్రిలియన్ డాలర్లు తగ్గుందని సీబీఓ మొదటగా అంచనా వేసింది. తాజాగా మూడు ట్రిలియన్ డాలర్లు మాత్రమే తగ్గే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Also Read: అప్పట్లో భుట్టో.. ఇప్పుడు షేక్ హసీనా.. ఇద్దరు ప్రధానులకు ఉరిశిక్ష, ఒకే పరిస్థితి
ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు ట్రంప్ సుంకాల ప్రభావానికి సంబంధించి CBO రిపోర్టును విడుదల చేసింది. అమెరికాలో 11 ఏళ్లలో వాణిజ్య లోటు 2.5 ట్రిలియన్ డాలర్లు తగ్గుతాయని తెలిపింది. దీంతో ప్రభుత్వ ఖర్చులు కూడా 500 బిలియన్ డాలర్లు తగ్గుతాయని తెలిపింది. కానీ ఇవి ఆగస్టు అంచనాల కంటే తక్కువే. ఆ నెలలో వాణిజ్య లోటును 3.3 ట్రిలియన్ డాలర్లుగా, ప్రభుత్వ ఖర్చులు 700 బిలియన్ డాలర్లు మిగులుతాయని అంచనా వేసింది CBO. తాజాగా ఈ డేటాను సవరిస్తూ మరో రిపోర్టు విడుదల చేసింది. ట్రంప్ టారిఫ్‌లు 2035 వరకు ఇలాగే కొనసాగితే మొత్తంగా వాణిజ్యం లోటు మూడు ట్రిలియన్ డాలర్లు మాత్రమే తగ్గే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది.
Also Read: ట్రంప్‌కు బిగ్ షాక్.. భారత్‌లో ఉద్యోగులను పెంచుకుంటున్న అమెరికన్ కంపెనీలు !
ఇదిలాఉండగా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇతర దేశాలపై టారిఫ్‌ల యుద్ధం ప్రారంభించారు. అమెరికా ఉత్పత్తులను ఇతర దేశాల్లో పెంచేందుకు, వాణిజ్య లోటును తగ్గించుకునేందుకు టారిఫ్ పేరుతో ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కేవలం 3 ట్రిలియన్ డాలర్ల వరకు మాత్రమే వాణిజ్య లోటు తగ్గే ఛాన్స్ ఉందని CBO అంచనా వేసింది. దీంతో ట్రంప్ టారిఫ్ మంత్రం అంతగా పనిచేయలేదని స్పష్టమవుతోంది. మరోవైపు ఆయా దేశాల మధ్య యుద్ధాలు ఆపేందుకు కూడా సుంకాలతో బెదిరించానని ట్రంప్ చెప్పుకున్నారు. మొత్తానికి టారిఫ్‌ల వల్ల అమెరికాకు భారీగా లాభం వస్తుందని ట్రంప్ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిందని విమర్శకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Follow Us