/rtv/media/media_files/2025/11/21/sheik-hasina-and-zulfikar-ali-bhutto-2025-11-21-18-01-19.jpg)
sheik hasina and zulfikar ali bhutto
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్(ITC) కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. గతేడాది బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా పాల్పడ్డారనే కారణంతో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నవాళ్లని ఎన్‌కౌంటర్ చేయాలని ఆమె ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు కూడా న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ప్రస్తుతం వీళ్లిద్దరూ భారత్‌లోనే ఉంటున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌లో ఉన్న యూనస్ ప్రభుత్వం.. వీళ్లిద్దరినీ అప్పగించాలని భారత ప్రభుత్వానికి లేఖ రాశాయి. కానీ భారత్ మాత్రం వాళ్లని పంపించేందుకు నిరాకరించింది. మొత్తానికి షేక్ హసీనా పరిస్థితిపై గందరగోళం నెలకొంది.
ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధించడం అనేది తీవ్రమైన అంశం. గతంలో పాకిస్థాన్‌కు ప్రధానమంత్రిగా, అధ్యక్షుడిగా పనిచేసిన జుల్ఫికర్ అలీ భుట్టో కూడా ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నారు. అక్కడి సుప్రీంకోర్టు కూడా ఆయనకు మరణశిక్ష విధించింది. అయితే ఆయన పాక్‌లోనే ఉండటం వల్ల చివరికి అక్కడి జైల్లో ఉరితీశారు. కానీ షేక్ హసీనా భారత్‌లో ఉండటంతో ఆమె ఈ శిక్ష నుంచి తప్పించుకున్నారు. అయితే ఈ రెండు కేసుల్లో కూడా న్యాయమూర్తులను మార్చడం, సాక్షులకు లంచాలు ఇవ్వడం లాంటివి జరిగాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే 1977, జులై 5ని పాకిస్థాన్‌లో చీకటి రోజుగా భావిస్తారు. ఆ సమయంలో సైనిక తిరుగుబాటు జరగడంతో భుట్టో ప్రభుత్వం కుప్పకూలింది. చివరికి ఆ దేశంలో మార్షల్ లాను విధించారు. ఈ తిరుగుబాటుకు పాక్ సైనికాధికారి జనరల్ ముహమ్మద్ జియా-ఉల్-హక్ నాయకత్వం వహించారు. ఆపరేషన్ ఫెయిర్ ప్లెయిన్స్ పేరుతో జుల్ఫికర్ అలీ భుట్టోను అరెస్టు చేశారు. అలాగే 1974లో జరిగిన నవాబ్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ కస్తురి హత్య కేసును తిరిగి ప్రారంభించారు. భుట్టో ఆదేశం మేరకే ఈ హత్య జరిగినట్లు తేలింది. దీంతో భుట్టోను దోషిగా తేల్చిన కోర్టు ఆయనకు ఉరిశిక్ష విధించింది. ఈ కేసు తీర్పులో న్యాయమూర్తులను మార్చడం, సాక్షులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి.
Also Read: ట్రంప్‌కు బిగ్ షాక్.. భారత్‌లో ఉద్యోగులను పెంచుకుంటున్న అమెరికన్ కంపెనీలు !
చివరికి అక్కడి సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. భూట్టో క్షమాభిక్ష పిటిషన్ సమర్పించినప్పటికీ జియా-ఉల్-హక్ దీన్ని తిరస్కరించారు. ఆయన ఉరిశిక్షకు వ్యతిరేకంగా భారత ప్రధాని ఇందిరా గాంధీ, అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కూడా అప్పీళ్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి 1979, ఏప్రిల్ 4న పాక్‌లోని రావల్పిండి జైలులో భుట్టోను ఉరితీశారు. ఇది రాజకీయ హత్య అని అప్పట్లో ఈ ఘటనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దాదాపు 49 ఏళ్ల తర్వాత పాక్ సుప్రీంకోర్టు ఈ ఉరిశిక్షపై విచారణ చేసింది. ఇది న్యాయంగా జరగలేదని.. ఇదొక న్యాపరమైన హత్య అంటూ అంగీకరించింది.
ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే గతేడాది బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అధికారంలో ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం నిరసనాకారులపైకి సైన్యాన్ని పంపించింది. ఈ ఘర్షణలో 1400 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే నిరసనలు తీవ్రతరం కావడంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు. బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు వచ్చారు. దీంతో అక్కడ మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. గతేడాది జరిగిన అల్లర్లపై అక్కడి కోర్టులో విచారణ జరగగా.. షేక్ హసీనాను దోషిగా తేలుస్తూ మరణశిక్ష విధించింది. ఈ తీర్పు కోసం కూడా అసలు న్యాయమూర్తులను తొలగించి కొత్త బెంచ్‌ను నియమించింది యూనస్ ప్రభుత్వం. సాక్షులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి.
Also Read: అమెరికాకు దిమ్మతిరిగే షాకిచ్చిన భారత్.. ఇకనైనా ట్రంప్ దిగొస్తాడా?
ప్రస్తుతం షేక్ హసీనా బంగ్లాదేశ్‌లో లేకపోవడంతో ఆమెకు ఉరిశిక్ష తప్పింది. లేకుంటే ఆమె పరిస్థితి కూడా జుల్ఫికర్ అలీ భుట్టో లాగే అయ్యేది. భారత్ కూడా ఆమెను బంగ్లాదేశ్‌కు పంపించేందుకు నిరాకరిస్తోంది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మరి రాబోయే రోజుల్లో అక్కడ ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.
Follow Us