/rtv/media/media_files/2025/03/09/uh1yFznve5YR8vPC4MJ3.jpg)
khamenei
అణు ఒప్పందం పై ఇరాన్ తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే.తాజాగా దీని పై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పందించారు. వారి చర్చలు సమస్యల పరిష్కార లక్ష్యంగా లేవని విమర్శించారు.
కొన్ని ప్రభుత్వాలు,విదేశీ నాయకులు చర్చలకు సిద్ధమేనని చెబుతున్నా..అవి బెదిరింపుల్లా ఉన్నాయి. వారి చర్చలు సమస్యల పరిష్కారం కంటే అధిపత్యమే లక్ష్యంగా ఉంటాయి.టెహ్రాన్ ను ఎదిరించలేమని తెలియడంతో చర్చలు అనే కొత్త వ్యూహాలు నెలకొల్పుతున్నారని ఖమేనీ మండిపడ్డారు. ఇదిలా ఉండగా అమెరికా నుంచి తమకు ఎలాంటి లేఖ అందలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘి అక్కడ ఓ మీడియా సంస్థతో తెలిపారు.
Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?
ఇరాన్ పై గరిష్ఠ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని..ట్రంప్ పేరును ప్రస్తావించకుండా విమర్శించారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడాన్ని నిలువరించేందుకు అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇదే అంశం పై ఇటీవల మాట్లాడిన ట్రంప్..టెహ్రాన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
ఈ మేరకు ఖమేనీకి లేఖ రాసినట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇరాన్ ముందు రెండు మార్గాలున్నాయి. సైన్యం,లేదా ఒప్పందం చేసుకోవడం...ఒప్పందానికే నేను ప్రాధాన్యం ఇస్తా.ఎందుకంటే ఇరాన్ ను దెబ్బతీయాలనుకోవడం లేదు. చర్చలు జరుపుతారని ఆశిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు. ఇక ఇరాన్ తో గతంలో అణు ఒప్పందం చేసుకున్న అమెరికా...2018 లో ట్రంప్ హయాంలోనే దాన్నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
Also Read:Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
Also Read: Maharashtra: లిప్‌స్టిక్‌తోపాటు కత్తీ, కారం పొడి తీసుకెళ్లండి.. మంత్రి కీలక వ్యాఖ్యలు