TTD: తిరుమల తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పారు. ఈ ఇష్యూలో తనపై పవన్ వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదన్నారు. అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నా. క్షమాపణలు గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు. స్పందించాల్సిన అవసరంలేదు.. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన నాయుడు.. సోషియల్ మీడియాలో ప్రతిఒక్కరి కామెంట్స్ కి స్పందించాల్సిన అవసరంలేదనే ఉద్దేశంతోనే ఈ విధమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తన వ్యాఖ్యలను అపాదించడం భావ్యం కాదన్నారు. తన మాటలు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించినవి కాదని, మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పానని అన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలకమండలి క్షమాణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఇది కూడా చదవండి: Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ రిలీఫ్.. హైకోర్టు కీలక ఆదేశాలు ప్రగాఢ సంతాపం.. ఇదిలా ఉంటే.. అన్నమయ్య భవనములో నిర్వహించిన పాలకమండలిలో మృతిచెందిన కుటుంబాలకు టీటీడీ ప్రగాఢ సంతాపం తెలిపింది. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం అందజేయాలని తీర్మానం చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు భక్తులకు రూ.5 లక్షలు పరిహారం అందిస్తామన్నారు. స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు రూ.2 లక్షలు పరిహారం ఇస్తామన్నారు. బాధ్యులపై చర్యలు..న్యాయ విచారణ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తప్పిదం జరిగింది వాస్తవం.. తప్పు చేసినవారిపై ఉపేక్షించే పరిస్థితి లేదు. జరిగింది ఓ దురదృష్టకరమైన సంఘటన. ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. మిగిలిన 7 రోజులకు సంభందించి వైకుంఠద్వార దర్శనానికి ఏరోజుకు ఆరోజే టోకన్లు జారీ చేస్తాం. వైకుంఠద్వార దర్శనంపై సీఎం అభిప్రాయాలపై చర్చిస్తాం. ఈ యేడాది పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఇలానే కొనసాగుతాయి. మృతిచెందిన 6 కుటుంబాల్లోని పిల్లల విద్య ఖర్చులు టీటీడీ భరిస్తుందని నాయుడు తెలిపారు. ఇది కూడా చదవండి: TGPSC: రేవంత్ సార్ మా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వండి.. గ్రూప్-4 అభ్యర్థుల వినతి!