Rahul Gandhi: రాహుల్‌గాంధీకి బిగ్‌ రిలీఫ్.. పరువు నష్టం కేసులో బెయిల్

విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. పరువు నష్టం కేసులో పుణె కోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడీ సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే

New Update
Rahul Gandhi

Rahul Gandhi

విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి బిగ్ రిలీఫ్ దక్కింది. పరువు నష్టం కేసులో పుణె కోర్టు ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. 2023 మార్చిలో లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వీడీ సావర్కర్‌ను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ గాంధీపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పుణెలోని ఓ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.   

Also Read: అవినీతిని ప్రశ్నించాడని సర్పంచ్‌ను చంపించిన మంత్రి.. అతను అరెస్ట్!

అయితే ఈ కేసుకు సంబంధించిన విచారణకు తాజాగా రాహుల్‌ గాంధీ వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. దీంతో ఆయనకు కోర్టు రూ.25 వేల పూచీకత్తు బాండ్‌పై కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రాహుల్‌కు పూచీకత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్‌ న్యాయస్థానం ముందు హాజరయ్యారు. రాహుల్ ఈ కేసుకు ప్రత్యక్షంగా హాజరుకాలేదు. అయితే కోర్టు రాహుల్‌కు శాశ్వత మినహాయింపు కల్పించిందని ఆయన తరఫు లాయర్ మిలింద్ పవార్ పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై తదుపరి విచారణను ఫిబ్రవరి 18కి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.  

Also Read: USA: ఒకవైపు మంచు తుఫాను..మరోవైపు కార్చిచ్చు..అల్లాడిపోతున్న అమెరికా

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు