Big Beautiful Bill: అమెరికాలో సంచలనం.. బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లుకు ఆమోదం

అమెరికాలో బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎట్టకేలకు ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్‌ బిల్లును ఆమోదించింది.

New Update
Donald Trump

Donald Trump

అమెరికాలో బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎట్టకేలకు ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అమెరికా ప్రతినిధుల సభ బిగ్ బ్యూటిఫుల్‌ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 218 మంది సభ్యులు ఓటు వేయగా.. 214 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ట్రంప్‌ కల సాకారం అయ్యింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గురువారం అమెరికా ప్రతినిధుల సంభ బిగ్‌ బ్యూటిఫుల్ బిల్లును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. 

Also Read: వాయు కాలుష్యం ఎఫెక్ట్.. నెలలు నిండకముందే, తక్కువ బరువుతో పుడుతున్న చిన్నారులు

ఈ క్రమంలోనే ఓటింగ్‌ జరిగింది. బిల్లును సమర్థిస్తూ 218, వ్యతిరేకిస్తూ 214 ఓట్లు వచ్చాయి. కేవలం నాలుగు ఓట్ల తేడాతోనే బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లును ఇద్దరు రిపబ్లికన్లు కూడా వ్యతిరేకించారు. మరోవైపు ఈ బిల్లుకు వ్యతిరేకంగా సభ మైనార్టీ నేత హకీం జెఫ్రీస్‌ 8 గంటల పాటు మాట్లాడారు. అంతకుముందే ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం పొందింది. ట్రంప్‌ సంతకంతో ఇది చట్టంగా మారనుంది. పన్నుల్లో కోతలు, వ్యయాన్ని నియంత్రించాలనే లక్ష్యాలతో ఈ బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును ట్రంప్ తీసుకొచ్చారు.  

Also Read: వామ్మో 15 రోజుల్లో ఇన్ని వందల సార్లు భూప్రకంపనలు.. ఎక్కడంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు