PM Modi: అణ్వస్త్ర బెదిరింపులను సహించేది లేదు..ప్రధాని మోదీ

అణ్వస్త్ర బెదిరింపులను భారత్ సహించదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా చేసిన ప్రసంగంలో దాయాది దేశానికి ఈ స్పష్టమైన సందేశం ఇచ్చారు. 

New Update
PM modi

PM modi warns pakistan on Nuclear Blackmail

ఇప్పటి వరకు భారత దేశాల జలాలు శత్రువల దాహం తీర్చాయి. కానీ ఇక మీదట అలా జరగదు. ఇప్పడు మన దేశం, మన రైతులు...వారికి నీటిపై ఉన్న హ్కులే ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత దేశం సంక్షేమం కోసం సింధు జలాల ఒప్పందాన్ని అంగీకరించమని మరోసారి స్పష్టం చేశారు. దీనిపై పాకిస్తాన్ ఎన్ని బెదిరింపులు చేసినా పట్టించుకోమని అన్నారు. వారి అణ్వస్త్ర బెదిరింపులు తాటాకు చప్పుళ్ళని...అలాంటి వాటిని సహించమని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్తాన్ నోరుమూసుకుంటే మంచిదని పరోక్షంగా సందేశం ఇచ్చారు. 

ఎర్రకోటపై రెపరెలాడిన మువ్వన్నెల జాతీయ పతకం..

ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ ఏడాది 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నయా భారత్ థీమ్‌తో నిర్వహించారు. రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధికి నివాళులు అర్పించిన తరవాత ఎర్రకోటపై జెండాను ఎగరేశారు ప్రధాని. మోదీ జెండాను ఆవిష్కరించడం వరుసగా ఇది 12వ సారి. 

దాని తరువాత దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.  దేశ ప్రజలందరికీ ప్రధాని స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఇది 140 కోట్ల భారతీయుల సంకల్ప పండుగ అని ఆయన అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు చేసి భారత్‌ను ఏకం చేశామని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. 100 కిలో మీటర్లు శత్రుదేశంలోకి వెళ్లి శత్రువులను మట్టుబెట్టిన భారత్‌ బలగాలను మెచ్చుకున్నారు. శుత్రువులు ఊహించని విధంగా దెబ్బకొట్టామని వివరించారు. 

Also Read: Allu Aravind: ఇక్కడ ఎవరి కుంపటి వారిదే..అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు